మహారాష్ట్ర ప్రొటెమ్ స్పీకర్‌గా కాళిదాస్ కొలంబకర్

| Edited By:

Nov 26, 2019 | 6:14 PM

మహారాష్ట్ర అసెంబ్లీ ప్రొటెమ్ స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే కాళిదాస్ కొలంబకర్‌ను గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ నియమించారు. ఆయన చేత గవర్నర్ మంగళవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయించారు. బుధవారం అసెంబ్లీ సెషన్ లో కొత్త ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేస్తారని కాళిదాస్ తెలిపారు. ఒకప్పుడు శివసేనలో ప్రముఖ నేతగా ఉన్న కాళిదాస్.. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం ఇటీవలే ఈ పార్టీని కూడా వీడి బీజేపీలో చేరారు. మహారాష్ట్రలోని వడాలా నియోజకవర్గం నుంచి […]

మహారాష్ట్ర ప్రొటెమ్ స్పీకర్‌గా కాళిదాస్ కొలంబకర్
Follow us on

మహారాష్ట్ర అసెంబ్లీ ప్రొటెమ్ స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే కాళిదాస్ కొలంబకర్‌ను గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ నియమించారు. ఆయన చేత గవర్నర్ మంగళవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయించారు. బుధవారం అసెంబ్లీ సెషన్ లో కొత్త ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేస్తారని కాళిదాస్ తెలిపారు. ఒకప్పుడు శివసేనలో ప్రముఖ నేతగా ఉన్న కాళిదాస్.. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం ఇటీవలే ఈ పార్టీని కూడా వీడి బీజేపీలో చేరారు. మహారాష్ట్రలోని వడాలా నియోజకవర్గం నుంచి ఈయన ఎనిమిదిసార్లు గెలుపొందారు. తాత్కాలిక స్పీకర్‌గా ఎవరినైనా నియమించాలంటే.. ఆ వ్యక్తి సీనియర్ మోస్ట్ సభ్యుడై ఉండాలన్న సంప్రదాయం ఉంది. బుధవారం సాయంత్రం మహారాష్ట్ర అసెంబ్లీలో బల నిరూపణ జరగాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ తీర్పు నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం హఠాత్తుగా మొదట ఎన్సీపీ నేత అజిత్ పవార్ తన డిప్యూటీ సీఎం పదవికి, ఆ తరువాత కొద్దిసేపటికే సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేయడంతో పరిణామాలు ఊహించలేనంత వేడెక్కాయి. ఇక శివసేన అధినేత ఉధ్దవ్ థాక్రే సీఎం కావచ్చునని వార్తలు వస్తున్నాయి.