
మహారాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ హైడ్రామా నడుస్తోంది. ఎన్సీపీ సీనియర్ నేత అజిత్‌పవార్ పార్టీ హైకమాండ్‌పై తిరుగుబాటు చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు అజిత్‌పవార్ . ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ మారడం లేదని , ఎన్సీపీ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. 40 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో అజిత్ పవార్ బీజేపీలో చేరుతారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇందులో ఏమాత్ర నిజం లేదన్నారు అజిత్‌పవార్. ప్రతి మంగళ, బుధవారం ఎన్సీపీ ఎమ్మెల్యేలతో తానే భేటీ అవుతానని అన్నారు . దీనిని తప్పుగా ఊహించుకొని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
అజిత్ పవార్ బీజేపీతో టచ్ లోకి వచ్చారని , మహారాష్ట్రలో 2019 పరిణామాలు రిపీట్ అవుతాయని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిని ఖండించారు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్. అజిత్ పవార్ ఎన్సీపీ లోనే కొనసాగుతారని తెలిపారు. పార్టీ మారుతారన్న ఊహాగానాలకు చెక్ పెడుతూ అజిత్‌పవార్ ఎన్సీపీ నిర్వహించిన ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు.
త్వరలో షిండే కూటమి లోని 17 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో అనర్హత వేటు పడుతుందని . అందుకే ముందుజాగ్రత్తగా బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఎన్సీపీ ఎమ్మెల్యేలకు గాలం వేసినట్టు ఊహాగానాలు విన్పిస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం