Dalit Groom Wedding: ఉత్తర భారతదేశంలో పెళ్లిళ్ల ఊరేగింపుల (Wedding)) సమయంలో ఘర్షణలు అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. పెళ్ళి సందర్భంగా దళితులు గుర్రంపై ఊరేగింపు నిర్వహించడాన్ని చాలాచోట్ల అడ్డుకున్న ఘటనలు, దాడుల గురించి మనం విన్నాం.. తాజాగా.. అలాంటి బెదిరింపులకు లొంగకుండా ఓ దళిత యువకుడు పోలీసుల పహారాలో తన పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించుకున్నాడు. దళితులు పెళ్లి ఊరేగింపును నిర్వహించి, వరుడిని గుర్రంపై ఊరేగిస్తే ఏడాది కాలం పాటు గ్రామం నుంచి బహిష్కరిస్తామని ఆ గ్రామస్థులు హెచ్చరించారు. అయితే.. పెళ్లి కుమారుడు (Dalit Groom Wedding) పోలీసులను ఆశ్రయించడంతో 100 మంది పోలీసుల పర్యవేక్షణలో ఊరేగింపు నిర్వహించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో గురువారం చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్ నీముచ్ జిల్లాలోని సర్సి గ్రామానికి చెందిన రాహుల్ మేఘ్వాల్ జనవరి 27న పెళ్లి జరిగింది. అయితే పెళ్లిని ఘనంగా నిర్వహింకూడదని.. గుర్రపు స్వారీ కూడా చేయొద్దని ఆ గ్రామానికి చెందిన కొంతమంది ఆదేశించారు. ఒకవేళ నిర్వహిస్తే ఏడాది పాటు గ్రామం నుంచి బహిష్కరిస్తామని, చర్యలు తప్పవంటూ గూండాలే హెచ్చరించారు. దీంతో రాహుల్, ఆయన తండ్రి ఫకీర్‌చంద్ మేఘ్వాల్ జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ రాహుల్ పెళ్లికి రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించారు.
దీంతో సమీపంలోని మూడు పోలీసు స్టేషన్లకు చెందిన సిబ్బందిని రాహుల్ పెళ్లి కోసం మోహరించారు. బంధువులు డీజే సౌండ్లు, డ్యాన్సుల మధ్య గుర్రంపై వరుడిని ఊరేగించారు. ఈ పెళ్లికి పోలీసు ఉన్నతాధికారులతో పాటు ఎస్‌డీఎం సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా పెళ్లి కొడుకు రాహుల్ గుర్రంపై వెళ్తున్న సమయంలో తన చేతిలో అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని పట్టుకొని కనిపించాడు.
మానస పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ కేఎల్ డాంగీ మాట్లాడుతూ.. ఊరేగింపు సమయంలో గొడవలు అవుతాయని అందరూ భయపడ్డారని పేర్కొన్నారు. పకడ్భందీగా పహారం నిర్వహించామని ఎలాంటి గొడవలు జరగలేదని పేర్కొన్నారు.
Also Read: