MP Election: నామినేషన్ ర్యాలీలో అనుహ్య ఘటన.. పబ్లిక్‌గా తొడ కొట్టి సవాల్ విసిరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

Madhya Pradesh Election 2023: కుస్తీ పడే రెజ్లర్లు తరచుగా ఈ భంగిమలో కనిపిస్తారు. ప్రత్యర్థి రెజ్లర్‌పై తొడ కొట్టడం కనిపిస్తుంది. అదే పద్ధతిలో, టాండన్ తనను తాను బలమైన ఎన్నికల రెజ్లర్‌గా నిరూపించుకోవడానికి ప్రయత్నించాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక్కసారిగా ఈ స్టైల్ లో రెచ్చిపోవడంతో అక్కడున్న వారంతా కంగుతిన్నారు.

MP Election: నామినేషన్ ర్యాలీలో అనుహ్య ఘటన.. పబ్లిక్‌గా తొడ కొట్టి సవాల్ విసిరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
Mla Ajay Tandon

Updated on: Oct 31, 2023 | 5:19 PM

తొడగొట్టి సవాల్ విసరం ఈనాటిది కాదు. కానీ, సభ్య సమాజంలో తొడకొట్టడం అంటే.. కొంచెం ఇబ్బందికరమే. సాధారణంగా తొడగొట్టడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అదీ ఇద్దరు మనుషులు బాహాబాహీ తలపడాల్సి వచ్చినప్పుడు తొడగొట్టి సవాల్ చేయడం అనేది అనాదిగా వస్తుంది. అది మల్లయుద్ధం వంటి రచ్చచేసే పరిస్థితుల్లో జరిగేది. కానీ, రోజులు మారాయి. రాజకీయాలు కొత్తగా తయారు అయ్యాయి. మాటలు మీరడం.. తొడలు చరచడం ఇప్పుడు కొత్త ధోరణి. మన నాయకులు సినిమాల్లోలా తొడలు చరిచి మరీ అవతలి వారిని ఛాలెంజ్ చేయడం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా ఎన్నికల ప్రచారంలోనూ చోటుచేసుుకుంది.

ఎన్నికల రంగంలో లీడర్ తొడ కొడతాడని సాధారణంగా మనం వింటుంటాం, కానీ ఏ నాయకుడు అయినా తొడ కొట్టడం మీరు ఎప్పుడైనా చూశారా? మీరు చూడకపోతే, మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలో ఓ ఎమ్మెల్యే అభ్యర్థి నడిరోడ్డు మీద నిలబడి తొడ కొట్టే వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక్కడి నుంచి సిట్టింగ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌ టాండన్‌ బహిరంగంగా తొడ కొట్టి ఈ ఎన్నికల్లో సత్తాతో పోరాడుతామని సందేశం ఇచ్చారు.

వాస్తవానికి నామినేషన్‌ పత్రాల దాఖలుకు చివరి రోజైన అక్టోబర్ 30న కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌ టాండన్‌ భారీగా మద్దతుదారులతో కలెక్టరేట్‌కు ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా సామాన్యులు, పార్టీ కార్యకర్తల్లో విపరీతమైన ఉత్సాహం నెలకొంది. టాండన్ బహిరంగ జీపులో డీజే చప్పుళ్ళతో సంబరాలతో కూడిన ప్రజల శుభాకాంక్షలను స్వీకరిస్తున్నాడు. ఇంతలో ఉత్కంఠ పెరిగిపోయి ఒక్కసారిగా జీపుపైకి వచ్చాడు అజయ్. ఈ సమయంలో, అజయ్ టాండన్ బ్యాండ్ ట్యూన్‌కి డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. కొద్దిసేపటికే అతను అందరు చూస్తుండగానే జీపుపై చుట్టూ తిరుగుతూ తొడ కొట్టి సవాల్ విసిరారు.

అఖాడాలో కుస్తీ పడే రెజ్లర్లు తరచుగా ఈ భంగిమలో కనిపిస్తారు. ప్రత్యర్థి రెజ్లర్‌పై తొడ కొట్టడం కనిపిస్తుంది. అదే పద్ధతిలో, టాండన్ తనను తాను బలమైన ఎన్నికల రెజ్లర్‌గా నిరూపించుకోవడానికి ప్రయత్నించాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక్కసారిగా ఈ స్టైల్ లో రెచ్చిపోవడంతో అక్కడున్న వారంతా కంగుతిన్నారు. అంతేకాదు ఈ సందర్భంగా టాండన్ బీజేపీ అభ్యర్థి జయంత్ మలయ్య చురకలంటిస్తూ.. తనకు ఇంకా డ్యాన్స్ చేసే వయసు పోలేదని, అందుకే ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నానని చెప్పాడు.

2020 సంవత్సరంలో, జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు సమయంలో దామోహ్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ లోధి బీజేపీలో చేరారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన అజయ్ టాండన్‌పై 17,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మరోసారి దామో నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అజయ్ టాండన్ బరిలోకి దిగగా, మాజీ మంత్రి జయంత్ మలయ్యపై బీజేపీ మరోసారి బరిలోకి దిగారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ లోధి చేతిలో జయంత్ మలయ్య అనూహ్యంగా ఓడిపోయారు. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా టీవీ నటుడు చాహత్ మణి పాండేని దామో సీటులో పోటీకి దింపింది. దామో సీటు నుంచి ఆసక్తికర పోటీ ఉంటుందని భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…