బ్రేకింగ్.. ఢిల్లీలో భూకంపం.. అంతకుముందు వెదర్‌లో భారీ మార్పులు

దేశ రాజధాని ఢిల్లీ వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు కరోనా మహమ్మారి భయంతో ప్రజలు గజగజ వణికిపోతున్న సమయంలో.. అటు ప్రకృతి కూడా స్థానికుల్ని భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా ఆదివారం ఉదయం ఓ వైపు దుమ్ము, ధూళీతో ఈదురుగాలులు వీస్తుండగా.. మరో చోట భారీ వర్షం కురిసింది. ఇంకొన్ని ప్రాంతాల్లో పట్టపగలే రాత్రిలా మారిపోయింది. ఈ క్రమంలోనే ఢిల్లీలో పలుచోట్ల భూమి కంపించింది. రిక్టార్ స్కేల్‌పై 3.5 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ […]

బ్రేకింగ్.. ఢిల్లీలో భూకంపం.. అంతకుముందు వెదర్‌లో భారీ మార్పులు
Earthquake

Edited By:

Updated on: May 10, 2020 | 3:00 PM

దేశ రాజధాని ఢిల్లీ వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు కరోనా మహమ్మారి భయంతో ప్రజలు గజగజ వణికిపోతున్న సమయంలో.. అటు ప్రకృతి కూడా స్థానికుల్ని భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా ఆదివారం ఉదయం ఓ వైపు దుమ్ము, ధూళీతో ఈదురుగాలులు వీస్తుండగా.. మరో చోట భారీ వర్షం కురిసింది. ఇంకొన్ని ప్రాంతాల్లో పట్టపగలే రాత్రిలా మారిపోయింది. ఈ క్రమంలోనే ఢిల్లీలో పలుచోట్ల భూమి కంపించింది. రిక్టార్ స్కేల్‌పై 3.5 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ పేర్కొంది. ఇదిలా ఉంటే గత నెలలో కూడా రెండు సార్లు భూకంపం సంభవించింది. నెల వ్యవధిలోనే మూడు సార్లు భూ ప్రకంపనలు సంభవించడంతో.. స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు.