Sansad TV: పార్లమెంట్ కార్యకలాపాలు ఇక ‘సంసద్ టీవీ’లో.. రాజ్యసభ, లోక్‌సభ టీవీల విలీనం..

|

Mar 02, 2021 | 12:34 PM

Lok Sabha, Rajya Sabha channels merged - Sansad TV: పార్లమెంటు కార్యకలాపాలను వీక్షించేవారు ఇకపై టీవీ ఛానళ్లను మార్చాల్సిన అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యసభ, లోక్‌సభ..

Sansad TV: పార్లమెంట్ కార్యకలాపాలు ఇక ‘సంసద్ టీవీ’లో.. రాజ్యసభ, లోక్‌సభ టీవీల విలీనం..
Follow us on

Lok Sabha, Rajya Sabha channels merged – Sansad TV: పార్లమెంటు కార్యకలాపాలను వీక్షించేవారు ఇకపై టీవీ ఛానళ్లను మార్చాల్సిన అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యసభ, లోక్‌సభ టీవీలను ఏకం చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. ఈ రెండు ఛానెళ్లను కలిపి సంసద్ టీవీగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఈ నూతన ఛాన‌ల్‌లో పార్లమెంటు కార్యకలాపాలు, తదితర ప్రకటనలు సంసద్ టీవీలో ప్రసారం కానున్నాయి. కాగా సంసద్ టీవీకి మాజీ ఐఏఎస్ అధికారి ర‌వి క‌పూర్‌ సీఈవోగా నియ‌మితులయ్యారు. ఆయన ఏడాది పాటు ఛానెల్‌కు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. సీఈవో ర‌విక‌పూర్ 1986 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. అస్సాం-మేఘాల‌యా క్యాడ‌ర్‌కు చెందిన ఆయన అస్సాంలో ప్రధాన కార్యదర్శిగా కార్యదర్శిగా పనిచేశారు. అలాగే పలు మంత్రిత్వ శాఖల్లో బాధ్యతలు కూడా నిర్వర్తించారు.

రాజ్యసభ, లోక్‌స‌భ టీవీల‌ను ఏకం చేసేందుకు అంతకుముందు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా నేతృత్వంలో ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. 2019 లో ప్రసార భారతి సీఈఓ సూర్య ప్రకాష్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఈ ప్రణాళికను ప్రతిపాదించింది. ఖర్చులు తగ్గించడం, ఛానెల్ నిర్వహణను క్రమబద్ధీకరించడం, ప్రేక్షకులను, ప్రకటనదారులకు మరింత చేరువకావడానికి ప్రణాళికలు రూపొందించారు. దీనికి రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఆమోదం తెలిపారు. దీంతో ఈ రెండు ఛానెళ్లను సంసద్ టీవీగా రూపొందించి పార్లమెంట్ కార్యకలాపాలను ప్రసారం చేయనున్నారు. రాజ్యసభ, లోక్‌సభ టీవీల‌ను విలీనం చేసిన నేపధ్యంలో ఇంతవరకూ రాజ్యసభ టీవీకి సీఈవోగా ఉన్న మ‌నోజ్ కుమార్ పాండేను ఆ బాధ్యతల నుంచి తొల‌గించారు. ఈ మేరకు లోక్‌సభ, రాజ్యసభ సచివాలయాలు ప్రకటనను విడుదల చేశాయి. అయితే రాజ్యసభ, లోక్‌సభ టీవీలకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు కూడా సంసంద్ ఫరిధిలోకే రానున్నాయి.

Also Read:

Breaking News :పాకిస్తాన్ లో అత్యవసరంగా దిగిన భారత విమానం, ఎందుకంటే ?

పుట్టినరోజు నాడు అసభ్యకరంగా న్యాయమూర్తికి మెస్సేజ్.. జైలు ఊచలు లెక్కబెడుతున్న న్యాయవాది..