PM Modi: నామ్‌దార్లు.. కామ్‌దార్‌లను అవమానించడం కొత్తేమీ కాదు.. రాహుల్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఏమన్నారంటే..

రాహుల్ గాంధీ తనపై చేసిన వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. కుల గణన గురించి మాట్లాడినప్పుడు మోదీ... కులం లేదు.. అంటారని.. మీరు OBC ఎలా ఉన్నారు?..అంటూ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ తరుణంలో తనపై చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించారు. తనపై కాంగ్రెస్ “షెహజాదా” రాహుల్ గాంధీ చేసిన అవమానకరమైన వ్యాఖ్యల పట్ల ప్రజలు కలత చెందవద్దని, కోపగించవద్దని అభ్యర్థిస్తున్నానన్నారు

PM Modi: నామ్‌దార్లు.. కామ్‌దార్‌లను అవమానించడం కొత్తేమీ కాదు.. రాహుల్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఏమన్నారంటే..
PM Modi Rahul Gandhi
Follow us

|

Updated on: Apr 25, 2024 | 1:59 PM

రాహుల్ గాంధీ తనపై చేసిన వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. కుల గణన గురించి మాట్లాడినప్పుడు మోదీ… కులం లేదు.. అంటారని.. మీరు OBC ఎలా ఉన్నారు?..అంటూ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ తరుణంలో తనపై చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించారు. తనపై కాంగ్రెస్ “షెహజాదా” రాహుల్ గాంధీ చేసిన అవమానకరమైన వ్యాఖ్యల పట్ల ప్రజలు కలత చెందవద్దని, కోపగించవద్దని అభ్యర్థిస్తున్నానన్నారు. తాము “కామ్‌దార్” (పనివంతులు).. అతనికి “నామ్‌దార్” (పేరు కలిగిన వారు) అనే పేరు ఉంది.. “నామ్‌దార్లు” సంవత్సరాలుగా “కామ్‌దార్‌లను” అవమానించడం కొత్తేమీ కాదు.. కాబట్టి ప్రజలు అతనిపై స్పందించి సమయం వృధా చేసుకోకుండా ముందుకు సాగాలి. అతను (రాహుల్ గాంధీ) చాలా కలత చెందాడు.. కలవరపడ్డాడు.. అతను కొన్ని రోజుల్లో మమ్మల్ని కూడా మరింత అవమానపరుస్తాడు. మేం సామాన్యులం, తాను పేద తరగతి నేపథ్యం నుంచి వచ్చాను కాబట్టి ఇలాంటి అవమానాలు తనకు కొత్త కాదు.. అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని మొరెనాలో విజయ్ సంకల్ప్ ర్యాలీని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని మోదీ వీడియో..

వారసత్వ పన్నుపై కూడా మోదీ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. వారసత్వ పన్నుకు సంబంధించిన వాస్తవాలు కళ్లు తెరిపిస్తాయి.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మరణించినప్పుడు, ఆమె పిల్లలు ఆమె ఆస్తిని పొందారు.. ఇంతకుముందు ఒక రూల్, ఆస్తి పిల్లలకు వెళ్లే ముందు దానిలో కొంత భాగాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఆస్తి ప్రభుత్వానికి వెళ్లకుండా కాపాడేందుకు, అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ వారసత్వ చట్టాన్ని రద్దు చేశారు.. అంటూ పేర్కొన్నారు.

కాంగ్రెస్ మేనిఫెస్టోలో దేశవ్యాప్తంగా సామాజిక-ఆర్థిక సర్వే.. తీవ్ర దుమారం రేపగా.. రాహుల్ గాంధీ దీనిపై బుధవారం మాట్లాడుతూ.. ప్రధాని మెదీపై పలు వ్యాఖ్యలు చేశారు. బిజెపి దళిత, గిరిజన చరిత్రను విస్మరించిందని గాంధీ విమర్శించారు. కాగా.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై.. బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles