ఊటీ, కొడైకెనాల్ వెళుతున్నారా? ఇది తెలుసుకోకపోతే ఇబ్బందులు తప్పవు!

TV9 Telugu

05 May 2024

ప్రస్తుత వేసవి సీజన్​లో ఊటీ, కొడైకెనాల్‌ వెళ్లేవారికి 'ఈ-పాస్ విధానం' తప్పనిసరి చేస్తూ ఇటీవల మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కొన్ని రోజుల క్రితం పర్యావరణ పరిరక్షణ పై వేసిన ఓ పిటిషన్‌ను ఇటీవల విచారించిన మద్రాసు హైకోర్టు ఈ నిర్ణయం తీసుకొంది.

ఈ అనుమతిని ముందుగా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా పొందాలి. ఇది తమిళనాడు ప్రభుత్వ ఆఫీసియల్ సైట్ లో ఉంది.

కరోనా కాలంలో అనుసరించిన "ఈ-పాస్'' విధానాన్ని ఊటీ, కొడైకెనాల్‌లో 'మే 7 నుంచి జూన్ 30' వరకు అమలు చేస్తున్నారు.

ఈ పాస్‌కు దరఖాస్తు చేసుకున్న వారికి అనుమతి పత్రం ఇస్తారు. వెహికల్స్ లో ఎంత మంది వస్తున్నారు? పర్యటన ఎన్ని రోజులు సాగిస్తారు? వంటి వివరాలను సేకరిస్తారు.

ఈ-పాస్ సిస్టమ్ అమలు ద్వారా.. ఒక రోజున ఎంత మంది జనాలు ఆయా ప్రాంతాల్లోకి రాబోతున్నారో ముందుగానే అధికారులకు తెలుస్తుంది.

పరిమితి మించుతోందని భావించినప్పుడు ఈ-పాస్​లు ఆపేస్తారు. దీనివల్ల జనాల రద్దీ తగ్గిపోతుంది. చెక్‌పాయింట్ల సమీపంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. కర్బన ఉద్గారాలు, చెత్తా చెదారం కూడా తగ్గిపోతుంది.

సో.. మీరుగానీ అక్కడికి వెళ్లాలంటే.. ముందుగా ఈ-పాస్ బుక్ చేసిన తర్వాతనే బయలుదేరండి. లేదంటే అక్కడికి వెళ్లి అవస్థలు పడాల్సి వస్తుంది.