
దేశవ్యాప్తంగా ఎన్నికల నగరా మోగింది. ఏప్రిల్ 19వ తేదీ నుంచి లోక్‌సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇక జూన్ 4వ తేదీన ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 7 దశాల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. 5వ దశలో జరిగే ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
5వ దశలో భాగంగా మొత్తం 8 రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 49 లోక్‌సభా స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి.. ఏప్రిల్ 26వ తేదీన ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నామినేషన్ల స్వీకరణకు మే 3వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. నామినేషన్ల స్క్రూటినిటీకి మే 4వ తేదీ చివరి తేదీ కాగా.. నామనేషన్ల ఉపంసహరణకు చివరి తేదీగా మే6వ తేదీని నిర్ణయించారు. ఇక 5వ దశ ఎన్నికల పోలింగ్ మే 20వ తేదీన నిర్వహించనున్నారు. ఫలితాలను జూన్ 4వ తేదీన ప్రకటించనున్నారు.
ఇదిలా ఉంటే ఈ సార్వత్రిక ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఇక ఎన్నికల కోసం మొత్తం 55 లక్షల ఈవీఎమ్ మిషిన్లను ఉపయోగించనున్నారు. ఈసారి ఎన్నికల్లో కొత్తగా 1.8 కోట్ల మంది తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అలాగే 20 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్ల సంఖ్య 19.47 కోట్ల మంది ఉన్నారు.
| State Name | Constituency Name | Phase | Date |
| Bihar | Hajipur | Phase 5 | 20-May-24 |
| Bihar | Madhubani | Phase 5 | 20-May-24 |
| Bihar | Muzaffarpur | Phase 5 | 20-May-24 |
| Bihar | Saran | Phase 5 | 20-May-24 |
| Bihar | Sitamarhi | Phase 5 | 20-May-24 |
| Jammu & Kashmir | Baramulla | Phase 5 | 20-May-24 |
| Ladakh | Ladakh | Phase 5 | 20-May-24 |
| Jharkhand | Chatra | Phase 5 | 20-May-24 |
| Jharkhand | Hazaribagh | Phase 5 | 20-May-24 |
| Jharkhand | Kodarma | Phase 5 | 20-May-24 |
| Maharashtra | Bhiwandi | Phase 5 | 20-May-24 |
| Maharashtra | Dhule | Phase 5 | 20-May-24 |
| Maharashtra | Dindori | Phase 5 | 20-May-24 |
| Maharashtra | Kalyan | Phase 5 | 20-May-24 |
| Maharashtra | Mumbai North | Phase 5 | 20-May-24 |
| Maharashtra | Mumbai North-Central | Phase 5 | 20-May-24 |
| Maharashtra | Mumbai North-East | Phase 5 | 20-May-24 |
| Maharashtra | Mumbai North-West | Phase 5 | 20-May-24 |
| Maharashtra | Mumbai South | Phase 5 | 20-May-24 |
| Maharashtra | Mumbai South -Central | Phase 5 | 20-May-24 |
| Maharashtra | Nashik | Phase 5 | 20-May-24 |
| Maharashtra | Palghar | Phase 5 | 20-May-24 |
| Maharashtra | Thane | Phase 5 | 20-May-24 |
| Orissa | Aska | Phase 5 | 20-May-24 |
| Orissa | Bargarh | Phase 5 | 20-May-24 |
| Orissa | Bolangir | Phase 5 | 20-May-24 |
| Orissa | Kandhamal | Phase 5 | 20-May-24 |
| Orissa | Sundargarh | Phase 5 | 20-May-24 |
| Uttar Pradesh | Amethi | Phase 5 | 20-May-24 |
| Uttar Pradesh | Banda | Phase 5 | 20-May-24 |
| Uttar Pradesh | Barabanki | Phase 5 | 20-May-24 |
| Uttar Pradesh | Faizabad | Phase 5 | 20-May-24 |
| Uttar Pradesh | Fatehpur | Phase 5 | 20-May-24 |
| Uttar Pradesh | Gonda | Phase 5 | 20-May-24 |
| Uttar Pradesh | Hamirpur | Phase 5 | 20-May-24 |
| Uttar Pradesh | Jalaun | Phase 5 | 20-May-24 |
| Uttar Pradesh | Jhansi | Phase 5 | 20-May-24 |
| Uttar Pradesh | Kaiserganj | Phase 5 | 20-May-24 |
| Uttar Pradesh | Kaushambi | Phase 5 | 20-May-24 |
| Uttar Pradesh | Lucknow | Phase 5 | 20-May-24 |
| Uttar Pradesh | Mohanlalganj | Phase 5 | 20-May-24 |
| Uttar Pradesh | Rae Bareli | Phase 5 | 20-May-24 |
| West Bengal | Arambag | Phase 5 | 20-May-24 |
| West Bengal | Bangaon | Phase 5 | 20-May-24 |
| West Bengal | Barrackpur | Phase 5 | 20-May-24 |
| West Bengal | Hooghly | Phase 5 | 20-May-24 |
| West Bengal | Howrah | Phase 5 | 20-May-24 |
| West Bengal | Sreerampur | Phase 5 | 20-May-24 |
| West Bengal | Uluberia | Phase 5 | 20-May-24 |
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..