Akilesh Yadav: కన్నౌజ్ లోక్‌సభ బరిలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత.. అఖిలేష్ యాదవ్ నామినేషన్ దాఖలు

కన్నౌజ్ లోక్‌సభ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేష్ యాదవ్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం 'భారత్‌-పాకిస్థాన్‌'పై బీజేపీ అభ్యర్థి సుబ్రతా పాఠక్‌ చేసిన ప్రకటనపై అఖిలేష్‌ స్పందించారు. మేం సోషలిస్టులమని అఖిలేష్ అన్నారు. 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదుతామన్నారు.

Akilesh Yadav: కన్నౌజ్ లోక్‌సభ బరిలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత.. అఖిలేష్ యాదవ్ నామినేషన్ దాఖలు
Akhileshyadav
Follow us

|

Updated on: Apr 25, 2024 | 2:32 PM

కన్నౌజ్ లోక్‌సభ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేష్ యాదవ్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం ‘భారత్‌-పాకిస్థాన్‌’పై బీజేపీ అభ్యర్థి సుబ్రతా పాఠక్‌ చేసిన ప్రకటనపై అఖిలేష్‌ స్పందించారు. మేం సోషలిస్టులమని అఖిలేష్ అన్నారు. 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదుతామన్నారు.

తేజ్ ప్రతాప్ ఇక్కడి నుండి పోరాడి ఉంటే, మ్యాచ్ నేపాల్ – భారత్ లాగా ఉండేదని కన్నౌజ్ బీజేపీ అభ్యర్థి సుబ్రతా పాఠక్ అన్నారు. ఆయన వ్యాఖ్యలపై ఎస్పీ అధినేత అఖిలేష్ తాజా స్పందించారు. మ్యాచ్ హిందుస్థాన్ పాకిస్తాన్ లాగా ఉంటుంది. భారత్ మాత్రమే గెలవాలన్నారు అఖిలేష్. అతను బంతిని విసరలేడు, బ్యాట్‌ను స్వింగ్ చేయలేడు. మొదటి బంతికే సిక్సర్ కొట్టకపోతే మనం సోషలిస్టులం కాదు. 6 బంతుల్లో సిక్స్ కొడతామన్నారు అఖిలేష్ యాదవ్.

నామినేషన్ దాఖలు చేసిన అనంతరం అఖిలేష్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. కన్నౌజ్‌లోని ఎస్పీ నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలందరూ తనను ఈ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుతున్నారని తెలిపారు. ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నానన్నారు. కన్నౌజ్ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ ప్రతికూల రాజకీయాలకు ముగింపు పలుకుతాయన్నారు. కన్నౌజ్ గుర్తింపును ముందుకు తీసుకెళ్తామన్న అఖిలేష్, కన్నౌజ్ ప్రజల గౌరవం, అభివృద్ధి కోసం పని చేస్తామన్నారు. కన్నౌజ్ అభివృద్ధిని అడ్డుకోవడం ద్వారా బీజేపీ ప్రతికూల రాజకీయాలు చేసిందని ఆరోపించారు.

నామినేషన్‌కు ముందు, అఖిలేష్ ‘X’లో కన్నౌజ్ నుండి నామినేషన్ 24 ఏళ్ల ఫోటోను షేర్ చేసి, చరిత్ర పునరావృతం అవుతుంది అని రాశారు. దీనిపై అఖిలేష్ మామ ఎస్పీ జనరల్ సెక్రటరీ శివపాల్ సింగ్ యాదవ్ విజయ భవ: ఎల్లప్పుడూ అంటూ రాసుకొచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..