PM Modi Campaign 2024: టార్గెట్ హ్యాట్రిక్.. లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించిన ప్రధాని మోదీ
లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించారు ప్రధాని నరేంద్ర మోదీ. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ సభలో పాల్గొన్న మోదీ విపక్షాలపై విరుచుకుపడ్డారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కొత్త ఓటర్లతో బీజేపీ యువమోర్చా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించారు ప్రధాని నరేంద్ర మోదీ. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ సభలో పాల్గొన్న మోదీ విపక్షాలపై విరుచుకుపడ్డారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కొత్త ఓటర్లతో బీజేపీ యువమోర్చా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రధాని మోదీ 2024 పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ లోని బులంద్‌షహర్‌లో పలు అభివృద్ది కార్యక్రమాలను మోదీ ప్రారంభించారు. రూ.20 వేల కోట్ల అభివృద్ది పనులను ప్రధాని ప్రారంభించారు. అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ట జరిగిన మూడు రోజులకే మోదీ యూపీలో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తూర్పు యుపిలోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, కొత్తగా నిర్మించిన అయోధ్య ఆలయంలో రామ్ లల్లా యొక్క పవిత్రోత్సవం జరిగిన కొద్ది రోజుల తర్వాత, జనవరి 25 న బులంద్‌షహర్‌లో ప్రధాని తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ 80 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఈసారి కూడా అత్యధిక సీట్లపై గురిపెట్టింది బీజేపీ. అందుకే ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచార బాధ్యతలపై తను భుజాలపై వేసుకున్నారు మోదీ. మరోసారి దేశంలో మోదీ సర్కార్ ఖాయమన్నారు యూపీ సీఎం యోగి.
గతంలో యూపీని పాలించిన రాజకీయ పార్టీలు ప్రజాసంక్షేమంపై దృష్టి పెట్టలేదన్నారు మోదీ. డబుల్ ఇంజన్ సర్కార్ తోనే దేశంలో అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ అభివృద్ది సాధ్యమన్నారు. యూపీ అభివృద్ది కోసమే తాను వారణాసి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తునట్టు తెలిపారు. చాలాకాలం యూపీని పాలించిన వాళ్లు రాజులలాగా ప్రవర్తించారు. ప్రజలను విభజించి పాలించారు. అధికారం కోసం దిగజారారు. వాళ్ల కారణంగా యూపీలో చాలా తరాలు బాధపడ్డాయన్నారు మోదీ.
జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కొత్త ఓటర్లతో బీజేపీ యువమోర్చా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. దేశంలో 5800 ప్రాంతాల్లో నిర్వహించిన ఈ సదస్సులో సుమారు 30 లక్షల మంది కొత్త ఓటర్లు పాల్గొన్నారు. వర్చువల్‌గా ప్రధాని మోదీ వీరితో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ మ్యానిఫెస్టో రూపకల్పన కోసం యువత తమ సూచనలను తన నమో యాప్‌కు పంపించాలని ప్రధాని కోరారు. మంచి సూచనలు చేసిన వారిని తాను వ్యక్తిగతంగా కలుస్తానని మోదీ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు.
ఇక లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన పాటను ప్రధాని మోదీ సమక్షంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేశారు. హిందీలో రూపొందించిన ఈ పాట కలలుకాదు వాస్తవాలు సిద్ధిస్తున్నాయని, అందుకే ప్రజలు మోదీని ఎన్నుకుంటున్నారంటూ సాగుతుంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆ పార్టీ మరోసారి మోదీ ప్రభుత్వం అనే నినాదాన్ని విడుదల చేసింది. దీన్ని అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విడుదల చేశారు. జాతీయ భద్రతా చర్యలు, వివిధ పథకాలతో సహా మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలపై కూడా బీజేపీ దృష్టి సారించింది.
सपने नहीं हकीकत बुनते हैं,तभी तो सब मोदी को चुनते हैं…
Today, BJP National President Shri @JPNadda launched BJP's official campaign for the 2024 general elections in the virtual presence of Honourable Prime Minister @narendramodi. pic.twitter.com/cqpcekKWEV
— BJP (@BJP4India) January 25, 2024
అయితే, మోడీ సొంత నియోజకవర్గం వారణాసి, లేదా అయోధ్య నుండి కాకుండా బులంద్‌షహర్ నుండి ప్రచారాన్ని ప్రారంభించాలనే నిర్ణయం వెనుక వ్యూహాత్మక హేతువుపై ఊహాగానాలకు దారితీసింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో తిరుగులేని విజయం సాధించిన బీజేపీ, 2019లో 80కి 62 సీట్లను మాత్రమే గెలుచుకుంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్ ఆరు నియోజకవర్గాల్లో ఓటమిని ఎదుర్కొన్న బీజేపి ఆప్రాంతం సవాలుగా మారింది. రాబోయే 2024 ఎన్నికలతో ప్రధాని మోడీ ఈ ట్రెండ్‌ను తిప్పికొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న 14 సీట్లలో ఎనిమిది స్థానాల్లో 8 బీజేపీ ఎంపీలు కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే బులంద్‌షహర్ నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించడం అదృష్టమని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
గత ఎన్నికల్లో పార్టీ సవాళ్లను ఎదుర్కొన్న ప్రాంతాల్లోని ఓటర్లతో కనెక్ట్ అవ్వాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని పోటీ స్థానాల్లో విజయం సాధించే ప్రయత్నంలో గెలుపు మంత్రాన్ని పంచుకోవడంపై దృష్టి సారించింది బీజేపీ.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…