Lockdown In Various States
Corona Pandemic: కరోనా విరుచుకు పడుతున్న వేళలో దేశవ్యాప్త లాక్ డౌన్ పై డిమాండ్స్ పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం అవసరం లేదని చెబుతోంది. ఆయా రాష్ట్రాలు స్థానికంగా తమకున్న పరిస్థితులను బట్టి లాక్ డౌన్ నిర్ణయాలు తీసుకుని అక్కడికక్కడ లాక్ డౌన్ విధించాలని చెబుతోంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ సాధ్యం కాదని స్పష్టం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీంతో కొన్ని రాష్ట్రాలు కొన్ని ప్రాంతాల్లోనూ.. కొన్ని రాష్ట్రాలు రాష్ట్ర వ్యాప్తంగానూ లాక్ డౌన్ లేదా కర్ఫ్యూలు పెడుతూ వస్తున్నారు. ఇప్పుడు దేశంలో ఏయే రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలులో ఉంది.. ఎక్కడెక్కడ ఏ ఆంక్షలు అమలు చేస్తున్నారు తెలుసుకుందాం.
రాష్ట్రాలలో లాక్ డౌన్ వివరాలు ఇలా ఉన్నాయి..
- ఏపీ ప్రభుత్వం మధ్యాహ్నాం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రెండు వారాల పాటు కర్ఫ్యూ వివిధించింది. తెలంగాణ
- ప్రభుత్వం ఈ నెల 8 వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగిస్తుంది. ఇక..
- ఢిల్లీలో మే 10 వరకు లాక్ డౌన్,బీహార్‌లో మే 15 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది.
- ఉత్తర ప్రదేశ్‌లో మే 7 వరకు లాక్ డౌన్ విధించారు. హరియాణా మే 10 వరకు లాక్ డౌన్ అమలులో పెట్టారు.
- ఒడిశా లో మే 19 వరకు లాక్ ,రాజస్థాన్ మే 17 వరకు లాక్ డౌన్ తప్పనిసరి.
- కర్నాటక లో మే 12 వరకు లాక్‌డౌన్,జార్ఖండ్ మే 6 దాకా లాక్ డౌన్
- ఛత్తీస్‌గఢ్ లో మే 5 వరకు లాక్ డౌన్.. స్ధానిక పరిస్ధితులను బట్టి జిల్లాలలో మే 15 వరకు లాక్‌డౌన్ విధించారు.
- పంజాబ్‌లో మే 15 వరకు కొనసాగనున్న రాత్రిపూట కర్ఫ్యూ, వారాంతపు లాక్ డౌన్
- మధ్యప్రదేశ్ లో మే 7 వరకు కొనసాగనున్న కర్ఫ్యూ
- గుజరాత్ 23 నగరాలలో కొనసాతున్న రాత్రి కర్ఫ్యూ
- మహారాష్ట్రా లో మే 15 వరకు లాక్‌డౌన్, ఉంటుంది.
- గోవాలో మే 3వరకు కొనసాగిన కర్ఫ్యూ,కొన్ని పర్యాటక ప్రాంతాలలో మే 10 వరకు ఆంక్షలు విధించారు.
- తమిళనాడు లో మే 20 దాకా తీవ్ర ఆంక్షలు,కేరళ లో మే 9 వరకు కఠిన లాక్ డౌన్ అమలు.
- పుదుచ్చేరిలో మే 10 దాకా లాక్‌డౌన్,ఆసోం లో మే 7వ తేదీ వరకు కొనసాగనున్న నైట్ కర్ఫ్యూ
- నాగాలాండ్ మే 14 వరకు పాక్షిక లాక్ డౌన్,
- మిజోరం లో మే 3 నుంచి రాజధాని సహా కొన్ని జిల్లాలలో ఎనిమిది రోజుల పాటు లాక్‌డౌన్
- జమ్మూకాశ్మీర్ లో 4 జిల్లాలలో మే 6వరకు లాక్‌డౌన్ మరో 20 జిల్లాల్లో రాత్రి పూట కర్ఫ్యూ
- ఉత్తరాఖండ్,హిమాచల్ ప్రదేశ్‌లో కొనసాగుతున్న రాత్రిపూట కర్ఫ్యూ
Also Read: Mamata Banerjee: ప్రమాణ స్వీకారం.. వెంటనే మమతా మార్క్.. కోవిడ్ నియంత్రణకు కఠిన మర్గదర్శకాలు..
Fact Check: కరోనా రెండో వేవ్ 5జి నెట్ వర్క్ వల్ల వచ్చిందా? వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్.. నిజాలివిగో..