ఢిల్లీలో లాక్ డౌన్ ను మరో వారం రోజులు పొడిగించారు. ఈ నెల 24 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఏప్రిల్ 19 న మొదటిసారి విధించిన లాక్ డౌన్ ని నాలుగోసారి.. ఈనెల 24వరకు పొడిగించడం విశేషం. నిజానికి ప్రస్తుత ఆంక్షలు రేపు ఉదయం 5 గంటలకు ముగియాల్సి ఉంది. కానీ ముందు జాగ్రత్త చర్యగా దీన్ని పొడిగిస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. నిన్న నగరంలో పాజిటివిటీ రేటు 11 శాతం ఉంది. 24 గంటల్లో కోవిద్ కేసులు ఆరున్నర వేల వరకు నమోదయ్యాయి. లాక్ డౌన్ కొనసాగించకపోతే వైరస్ పై జరుపుతున్న పోరుకు అర్థం ఉండదని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇదే సమయంలో ఆటో డ్రైవర్లు, టాక్సీ వాలాలు, ఇతర బడుగు వర్గాలకు 5 వేల రూపాయల మేర ఆర్ధిక సహాయం అందిస్తున్నట్టు ఆయన ఇదివరకే ప్రకటించారు. ఆలాగే మున్సిపల్ కార్మికుల వేతనాల కోసం వెయ్యి కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఇక హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ కోవిద్ నుంచి కోలుకుంటున్న రోగులకు ఇళ్ల వద్దే ఆక్సిజన్ సిలిండర్లను డెలివరీ చేసే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. కోవిడ్ మేనేజ్ మెంట్ కోసం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టం ని సర్కార్ ఏర్పాటు చేసింది. దీనివల్ల కోవిద్ రోగులకు మరింత సత్వర సహాయం అందుతుంది.
నగరంలో కోవిద్ కేసులు ఇంకా తగ్గిన పక్షంలో లాక్ డౌన్ పై అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ : 5 tigers and 1 monkey viral video :ఒకేసారి ఐదు పులుల్ని ముప్పతిప్పలు పెట్టిన వానరం..కోతి చేష్టలుకు అల్లాడిపోయిన పులులు.
సాయం పొందిన రియల్ హీరో..! ఆ అమ్మాయే దేశంలో అత్యంత సంపన్నురాలు – సోను సూద్ :Sonu Sood video.