Lift Collapse: 14 మందితో ఒక్కసారిగా కూలిన ఎలివేటర్.. హాస్పిటల్‌ పాలైన పలువురు.. 16 ఫ్లోర్ల బిల్డింగ్‌లో..

Mumbai: ముంబైలో ఎలివేటర్ కూలిపోవడంతో 14 మంది గాయపడ్డారు. వారిలో 9 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. 16 అంతస్థుల నిర్మాణ భవనంలో నాల్గొ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌కి వస్తుండగా ఈ ఘటన జరిగింది. బృహముంబై మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు..

Lift Collapse: 14 మందితో ఒక్కసారిగా కూలిన ఎలివేటర్.. హాస్పిటల్‌ పాలైన పలువురు.. 16 ఫ్లోర్ల బిల్డింగ్‌లో..
Mumbai Elevator Accident (Representative Image)

Updated on: Jun 21, 2023 | 6:20 PM

Mumbai: ముంబైలో ఎలివేటర్ కూలిపోవడంతో 14 మంది గాయపడ్డారు. వారిలో 9 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. 16 అంతస్థుల నిర్మాణ భవనంలో నాల్గొ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌కి వస్తుండగా ఈ ఘటన జరిగింది. బృహముంబై మునిసిపల్ కార్పొరేషన్(BMC) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని కమలా మిల్స్ కాంపౌండ్‌లోని ట్రేడ్ వరల్డ్ టవర్ సీలో ఈ ఘటన జరిగింది. మొత్తం 14 మందితో నాల్గో ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌కి వస్తున్న ఎలివేటర్ ఒక్కసారిగా కూలిపోయింది.

దీంతో ఎలివేటర్‌లోని 14 మందిలో నలుగురికి స్వల్పగాయాలు కాగా.. 9 మంది ఆసుపత్రి పాలయ్యారు. 8 మంది గ్లోబల్ ఆసుపత్రిలో చేరగా.. ఒకరు కేఈఎమ్ హాస్పిటల్‌లో చేరారు. అయితే స్వల్ప గాయాలైన నలుగురు ఆసుపత్రికి వెళ్లేందుకు నిరాకరించారు. ప్రమాదంలో గాయపడినవారంతా నిలకడగా ఉన్నారని, కంగారు పడాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..