Leopard Attack: కాలేజీలో చిరుత పులి హల్‌చల్‌.. విద్యార్థిపై పంజా.. భయంతో క్యాంపస్‌లో తొక్కిసలాట..

తరగతి గదిలో ఉన్న విద్యార్థిపై హఠాత్తుగా ఓ చిరుతపులి వచ్చి దాడిచేసింది. అతనిని తీవ్రంగా గాయపర్చింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు..

Leopard Attack: కాలేజీలో చిరుత పులి హల్‌చల్‌.. విద్యార్థిపై పంజా.. భయంతో క్యాంపస్‌లో తొక్కిసలాట..

Edited By: Anil kumar poka

Updated on: Dec 02, 2021 | 11:41 AM

తరగతి గదిలో ఉన్న విద్యార్థిపై హఠాత్తుగా ఓ చిరుతపులి వచ్చి దాడిచేసింది. అతనిని తీవ్రంగా గాయపర్చింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. దీంతో కాలేజీ గేటు వద్ద తొక్కిసలాట జరిగి కొందరు విద్యార్థులు గాయపడ్డారు. అటవీశాఖ అధికారులు సుమారు 9గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహిస్తే కానీ చిరుత చిక్కలేదు. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌ జిల్లా ఛర్రా పోలీస్ స్టేషన్ ప్రాంత పరిధిలోని చౌదరి నిహాల్ సింగ్ ఇంటర్ కాలేజ్‌లో బుధవారం ఈ ఘటన జరిగింది.

కాగా ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమీప అటవీ ప్రాంతం నుంచి సైలెంట్‌గా తరగతి గదిలోకి చొరబడిన పులి ఓ విద్యార్థిపై పంజా విసిరింది. దీంతో విద్యార్థి వీపు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఇతర విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున కేకలు వేయడం, కాలేజీలోని అలారం మోగడంతో చిరుత ఓ తరగతి గదిలో దాక్కుంది. ఈ విషయం తెలుసుకున్న కాలేజీ యాజమాన్యం వెంటనే పోలీసులు, అటవీ అధికారులకు సమాచారమిచ్చింది. కాలేజీలోకి చేరుకున్న అటవీ అధికారులు చిరుతను పట్టుకునేందుకు 9గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించాల్సి వచ్చింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ ఆపరేషన్‌ రాత్రి 7.30 గంటలకు ముగిసింది. చివరకు వైల్డ్‌ లైఫ్‌ ఎస్‌ఓఎస్‌ అనే ఎన్‌జీవో సిబ్బంది సహాయంతో చిరుత పులిని పట్టుకున్నారు. కాగా చిరుత దాడిలో గాయపడ్డ విద్యార్థిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.

Also Read:

Bank Strike: డిసెంబర్16,17 తేదీల్లో ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగుల సమ్మె.. ఎందుకంటే..

Congress on Mamata: దేశంలో యూపీఏ లేదన్న బెంగాల్ ముఖ్యమంత్రి.. మమతాకు గట్టి కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్..!

Silver Price Today: దేశ వ్యాప్తంగా తగ్గిన వెండి ధరలు.. నేడు కిలో వెండి ధర ఎంత ఉందంటే..