
డాక్టర్లను నడిచే దేవుళ్లుగా భావిస్తారు ప్రజలు. అయితే కొందరు డాక్టర్లు మాత్రం అలక్ష్యంగా వ్యవహరిస్తూ వృత్తికి కళంకం తెస్తున్నారు. తాజాగా ఓ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ రెండేళ్ల పాటు నరకం అనుభవించింది. ప్రసవం కోసం వచ్చిన మహిళ కడపులో గుడ్డ ముక్క ఉంచి కుట్లు వేశారు వైద్యులు. ఆ గుడ్డ రెండేళ్ల పాటు కడుపులోనే ఉండటంతో ఆమె తీవ్రమైన కడుపునొప్పి అనుభవించింది. అది ఇంకొన్నాళ్లు కడుపులోనే ఉండి ఉంటే… ఇన్‌ఫెక్షన్ అయి ప్రాణానికే ప్రమాదం వాటిల్లేదని వైద్యులు చెబుతున్నారు. తాజాగా ఆ గుడ్డ ముక్కను కడుపు నుంచి బయటకు తీయడంతో ఆమె కోలుకుంటోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది.
వికాశ్ వర్మ, అన్షుల్ దంపతులు గ్రేటర్ నోయిడాలో నివాసం ఉంటున్నారు. 2023లో అన్షుల్ ప్రెగ్నెంట్ అయింది. నవంబర్ నెలలో ఆమెకు నొప్పులు రావటంతో గ్రేటర్ నోయిడాలోని బస్కన్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అన్షుల్‌కు సాధారణ ప్రసవం అవుతుందని కుటుంబసభ్యులు భావించారు. అయితే, నార్మల్ డెలివరీ కుదరదని, ఆపరేష్ చేయాల్సిందేనని అక్కడి వైద్యులు చెప్పారు. 2023, నవంబర్ 14వ తేదీన ఆమెకు సర్జరీ చేసి బిడ్డను బయటకు తీశారు. ఆపరేషన్ జరిగిన కొద్దిరోజుల తర్వాత అన్షుల్ ఇంటికి వెళ్లిపోయింది. ఇంటికి వెళ్లిన నాటి నుంచి ఆమె కడుపు నొప్పి మొదలయింది. కుట్ల కారణంగా నొప్పి వస్తుందని కుటుంబ సభ్యులు భావించారు. స్థానికంగా ఉన్న ఆస్పత్రికి వెళ్లి మందులు వాడింది. కడుపునొప్పి తీవ్రతరం కావడంతో.. ఇటీవల కైలాష్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అక్కడ టెస్టులు చేసిన డాక్టర్లు.. ఆమె కడపులో అర మీటర్ ఉన్నట్లు గుర్తించారు. సర్జరీ చేసి దాన్ని బయటకు తీశారు. ఇంకొన్నాళ్లు అది లోపలే ఉండి ఉంటే ఆమె ప్రాణాలకు ముప్పు వాటిల్లేదని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన బస్కన్ ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..