Karnataka: కుజ దోషం ఉందని పెళ్లికి నిరాకరించిన ప్రియుడు.. ఊహించని పని చేసిన లేడీ కానిస్టేబుల్​

|

Jun 18, 2022 | 8:54 AM

అమ్మాయి జాతకంలో కుజ దోషం ఉందని అతని తల్లి వీరి వివాహానికి అంగీకరించలేదు. దీంతో ప్రవీణ్.. సుధతో పెళ్లికి నిరాకరించాడు. దీంతో....

Karnataka: కుజ దోషం ఉందని పెళ్లికి నిరాకరించిన ప్రియుడు.. ఊహించని పని చేసిన లేడీ కానిస్టేబుల్​
Lady Constable Suicide
Follow us on

Tragedy: వారిద్దరూ ఆరేళ్లగా ప్రేమించుకుంటున్నారు. ఒకరికి ఒకరంటే చాలా ఇష్టం. ఇక పెళ్లి చేసుకుందాం అనుకుని.. తెలిసిన పంతులు వద్ద జాతకాలు చూపించాడు వరుడు. అయితే  అమ్మాయి జాతకంలో కుజ దోషం ఉందని చెప్పడంతో… ప్రియుడు పెళ్లికి నో చెప్పాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన యువతి… విషం తాగింది. వెంటనే మంగళూరు(Mangalore)లోని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు విడిచింది. మృతురాలు సుధ.. శివమొగ్గ జిల్లా(Shivamogga District) తీర్థహళ్లి పోలీస్​ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్​గా విధులు నిర్వర్తిస్తోంది. వివరాల్లోకి వెళ్తే… ప్రవీణ్, సుధ ఆరేళ్లుగా లవ్  చేసుకుంటున్నారు. సుధ మహిళా కానిస్టేబుల్​గా వర్క్ చేస్తుండగా.. ప్రవీణ్ ఫారెస్ట్ రేంజ్​ ఆఫీసర్​గా విధులు నిర్వర్తిస్తున్నాడు. పెళ్లి విషయం రావడంతో ప్రవీణ్.. సుధ జాతకాన్ని తన తల్లికి చూపించాడు. అయితే అమ్మాయి జాతకంలో కుజ దోషం ఉందని అతని తల్లి వీరి మ్యారేజ్‌కు నిరాకరించింది. దీంతో ప్రవీణ్ కూడా సుధతో పెళ్లికి నో చెప్పాడు. కానీ అతనంత ఈజీగా ఆమె.. ప్రేమించిన వ్యక్తిని వదిలేయలేకపోయింది.

మే 31న భద్రావతిలో విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్​ను వద్దకు వెళ్లి తనను మ్యారేజ్ చేసుకోవాలని కోరింది. అయినా పెళ్లికి ప్రవీణ్ ఒప్పుకోలేదు. కలిసి ఎలాగూ బ్రతకలేం కాబట్టి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. అనంతరం భద్రావతి ఏపీఎంసీ ఆవరణకు వచ్చి విషం తాగాలని డిసైడయ్యారు. మొదట సుధనే విషం తాగమన్నాడు ప్రవీణ్​. ఆ తర్వాత అతను విషం తీసుకోలేదని సమాచారం అందుతోంది. కేవలం అలా నటించాడని ప్రాథమికంగా తెలుస్తోంది. ఆపై వారిని గుర్తించి… శివమొగ్గలోని మెక్‌గన్ ఆసుపత్రిలో చేర్చారు స్థానికలు. అనంతరం సుధను మెరుగైన చికిత్స కోసం మంగళూరులోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలో కానిస్టేబుల్ సుధ పోలీసులకు ఇచ్చిన చివరి వాంగ్మూలంలో అన్ని విషయాలు చెప్పింది. ఆమె చెప్పిన వివరాలతో భద్రావతి ఓల్డ్ సిటీ పోలీస్​ స్టేషన్​లో ప్రవీణ్​పై కేసు నమోదైంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..