వాటర్ గ్లాసుల ముసుగులో ఇంత జరుగుతుందా..? అధికారులు తనిఖీల్లో బయటపడ్డ..

దేశంలో ఎలక్ట్రానిక్ సిగరెట్లపై పూర్తి స్థాయి నిషేధం అమల్లో ఉన్నప్పటికీ, స్మగ్లర్ల ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. నిషేధిత ఇ-సిగరెట్లను భారత్ మీదుగా విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న భారీ ముఠా గుట్టును అధికారులు రట్టు చేశారు. మెరుపు దాడి చేసి, ఏకంగా రూ.13.50 కోట్ల విలువైన 55,000 విదేశీ బ్రాండ్ల ఇ-సిగరెట్లను సీజ్ చేశారు.

వాటర్ గ్లాసుల ముసుగులో ఇంత జరుగుతుందా..? అధికారులు తనిఖీల్లో బయటపడ్డ..
Dri Seizes Over 55000 Illegal E Cigarettes

Edited By:

Updated on: Oct 28, 2026 | 2:58 PM

మన దేశంలో ఎలక్ట్రానిక్ సిగరెట్లు, అన్ని ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్స్‌పై నిషేధం ఉంది అయినా సరే భారత్‌లో ఇ-సిగరెట్లు అందుబాటులో ఉండటమే కాకుండా ఇతర దేశాలకు ఎగుమతి అవుతుండటంతో DRI అధికారులు అప్రమత్తమయ్యారు. తాజాగా కోల్‌కతాలోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్టులో 55,000కు పైగా అక్రమంగా రవాణా చేస్తున్న ఇ-సిగరెట్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ స్వాధీనం చేసుకుంది. నేపాల్‌కు వెళ్తున్న కంటైనర్లలో ఇ-సిగరెట్లు ఉన్నాయని అనుమానించిన అధికారులు రెండు కంటైనర్ల ట్రాన్స్‌షిప్‌మెంట్ సరుకును అడ్డుకున్నారు.

వాటర్ గ్లాస్, సెరామిక్ మగ్స్ పేరుతో ఇ-సిగరెట్ల అక్రమ రవాణా

శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్టులో DRI అధికారులు రెండు అనుమానిత కంటైనర్‌లను తనిఖీ చేయగా గ్లాస్, సెరామిక్ మగ్స్ సరుకు మధ్య దాచి ఉంచిన వివిధ ఫ్లేవర్లకు చెందిన 55000 ఇ-సిగరెట్లను గుర్తించారు. ఇందులో ఐగెట్, వీటీవీ, వోకో, బ్యాంగ్ , ఇజాయ్ వంటి వివిధ బ్రాండ్‌లకు చెందిన ఇ-సిగరెట్లు ఉన్నాయి. కస్టమ్స్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద, కవర్ కార్గోతో పాటు మొత్తంగా రూ.13.50 కోట్ల విలువైన సుమారు 55,000 ఇ-సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాపు కొనసాగిస్తున్నారు. ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టం-2019 ప్రకారం.. దేశంలో ఎలక్ట్రానిక్ సిగరెట్లు, అన్ని ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్స్ నిషేధించబడ్డాయి.

దేశంలో ఇ సిగరెట్ల ఉత్పత్తి, తయారీ, దిగుమతి, ఎగుమతి, రవాణా, అమ్మకం, పంపిణీ, నిల్వ చేయడం,ప్రకటనలు ఇవ్వడం పై పూర్తి నిషేధం ఉంది. అయినా కూడా ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరంలో, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ఓడరేవులు, విమానాశ్రయాలు, ఐసీడీలలో డీఆర్ఐ ఇప్పటికే రూ.120 కోట్లకు పైగా విలువైన సుమారు 3,00,000 ఇ-సిగరెట్లను స్వాధీనం చేసుకుంది. అక్రమ మార్గాల్లో భారత్‌లోకి ఇ సిగరెట్ల దిగుమతి, ఎగుమతులపై డీఆర్ఐ ఎప్పటికప్పుడు తీవ్రంగా స్పందిస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us