Naegleria fowleri: నైగ్లేరియా ఫ్లవరీ.. మెదడు తినే ప్రాణాంతక బ్యాక్టీరియాతో కేరళ టీనేజర్ మృతి

కేరళలోని అలప్పుజా జిల్లాలో ఒక 15 ఏళ్ల బాలుడు “మెదడు తినే అమీబా” వల్ల మరణించాడు. అతను తన ఇంటికి సమీపంలోని ఒక ప్రవాహంలో స్నానం చేసేవాడు. అక్కడే అది అతని బాడీలోకి ఎంటరయ్యింది.

Naegleria fowleri: నైగ్లేరియా ఫ్లవరీ.. మెదడు తినే ప్రాణాంతక బ్యాక్టీరియాతో కేరళ టీనేజర్ మృతి
Amoeba (Photo: Wikimedia Commons)

Updated on: Jul 08, 2023 | 7:57 PM

నైగ్లేరియా ఫ్లవరీ.. మెదడు తినే ప్రాణాంతక బ్యాక్టీరియా ఇది. నీటిలో ఉంటుంది. కంటికి ఏమాత్రం కనిపించదు. కానీ శరీరంలోకి ప్రవేశించిందంటే మాత్రం రోజులు లెక్కపెట్టుకోవడమే. గంటల వ్యవధిలోనే మనిషి మెదడును తినేసి.. చంపేసేంత డేంజర్ బ్యాక్టీరియా ఇది. కేరళలో ఓ 15ఏళ్ల కుర్రాడు వాగులో ఈతకు వెళ్లాడు. ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా ఈత కొట్టాడు. కానీ కాసేపటికే అస్వస్థతకు గురయ్యాడు. కంగారు పడిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. ఆ కుర్రాడు చనిపోయాడు. ఈ ఇన్ఫెక్షన్ సోకిన కొద్ది రోజుల్లోనే మనిషి చనిపోవడం ఖాయం. ఈ వ్యాధి సోకిన వారిలో 97 శాతం మంది ప్రాణాలు కోల్పోయారంటే ఇది ఎంత డేంజరో అర్ధం చేసుకోండి. ఇంత ప్రాణాంతక వ్యాధి సోకితే తలముందు భాగంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. జ్వరం, గొంతు మంట, వికారం, వాంతులు, మెడ పట్టేయడం, మూర్ఛ రావడం వంటి లక్షణాలు ఉంటాయి.

కలుషిత నీటిలో ఉన్నప్పుడు.. చెవి లేదంటే ముక్కు ద్వారా ఇది శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది అంటువ్యాధి కాదు, మనుషుల నుంచి మనుషులకు సోకదు. ఇండియాలో 2016లో ఈ వ్యాధిని గుర్తించారు. కేరళలోని అలప్పుజలో తొలికేసు నమోదయ్యింది. 2019, 2020లో మలప్పురంలో 2 కేసులు రికార్డయ్యాయి. 2022లో త్రిసూర్‌లో ఒక కేసు వెలుగుచూసింది. మొత్తంగా భారత్‌లో ఇప్పటివరకు 5 కేసులు వెలుగుచూశాయి.

ఈ వ్యాధి సోకితే చికిత్స కూడా లేదు. ప్రస్తుతానికి యాంటీ ఫంగల్‌ మందులతోనే వైద్యం ఇస్తున్నారు. సో.. ఈ ఇన్ఫెక్షన్ సోకితే కోలుకోవడం చాలా కష్టం. అందుకే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. నీళ్లు మురికిగా ఉన్న కుంటలు, చెరువుల్లో స్నానం చేయకపోవడం మంచిది. అంతే కాకుండా స్విమ్మింగ్‌పూల్స్‌, వాటర్‌ ట్యాంకులను తరచూ క్లోరినేషన్‌ చేసుకోవడం మంచిది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..