సముద్రంలో మునిగిపోతున్న చేపల పడవ.. ప్రతికూల వాతావరణం, ఎత్తైన అలలు.. కోస్డ్ గార్డ్ సాహసం!

కర్ణాటక తీరంలోని సూరత్‌కల్ సముద్ర జలాల్లో ప్రమాదంలో చిక్కుకున్న ఆరుగురు మత్స్యకారులను భారత తీరరక్షక దళం (Indian Coast Guard) సాహసోపేతంగా రక్షించింది. ప్రతికూల వాతావరణం, ఎత్తైన అలలు, వేగమైన గాలులు, చీకటి కమ్ముకుంటున్న పరిస్థితుల్లోనూ కేవలం 90 నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకుని అందరి ప్రాణాలను కాపాడింది. దీంతో తీరరక్షక దళం ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటామని మరోసారి సార్థకం చేసింది.

సముద్రంలో మునిగిపోతున్న చేపల పడవ.. ప్రతికూల వాతావరణం, ఎత్తైన అలలు.. కోస్డ్ గార్డ్ సాహసం!
Indian Coast Guard

Updated on: Jun 30, 2026 | 11:16 AM

కర్ణాటక తీరంలోని సూరత్‌కల్ సముద్ర జలాల్లో ప్రమాదంలో చిక్కుకున్న ఆరుగురు మత్స్యకారులను భారత తీరరక్షక దళం (Indian Coast Guard) సాహసోపేతంగా రక్షించింది. ప్రతికూల వాతావరణం, ఎత్తైన అలలు, వేగమైన గాలులు, చీకటి కమ్ముకుంటున్న పరిస్థితుల్లోనూ కేవలం 90 నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకుని అందరి ప్రాణాలను కాపాడింది. దీంతో తీరరక్షక దళం ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటామని మరోసారి సార్థకం చేసింది.

జూన్ 29వ తేదీ సోమవారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో సూరత్‌కల్ తీరానికి 33 నాటికల్ మైళ్ల దూరంలో ప్రయాణిస్తున్న ఐఎఫ్‌బీ మంజు మాతా అనే చేపల పడవ నుంచి విహెచ్‌ఎఫ్ ద్వారా అత్యవసర ప్రమాద సంకేతం అందింది. పడవ అడుగు భాగంలో పగుళ్లు ఏర్పడటంతో సముద్రపు నీరు వేగంగా లోపలికి చేరడం ప్రారంభమైంది. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో పడవ ఎప్పుడైనా మునిగిపోయే పరిస్థితి ఏర్పడి, అందులో ఉన్న ఆరుగురు మత్స్యకారుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి.

సమాచారం అందుకున్న వెంటనే భారత తీరరక్షక దళం ఐసీజీఎస్ సాచెట్ నౌకను సహాయక చర్యలకు పంపించింది. తీవ్ర ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంటూ నౌక కేవలం 90 నిమిషాల్లో ప్రమాద స్థలానికి చేరుకుంది. అప్పటికే బలమైన గాలులు, భారీ అలలు, తగ్గుతున్న వెలుతురు కారణంగా సహాయక చర్యలు మరింత క్లిష్టంగా మారాయి.

ఈ నేపథ్యంలో తీరరక్షక దళ సిబ్బంది ప్రత్యేకంగా ప్రతికూల సముద్ర పరిస్థితుల కోసం రూపొందించిన రిమోట్-ఆపరేటెడ్ లైఫ్‌బాయ్‌లను వినియోగించారు. వాటి సహాయంతో ఒక్కొక్కరిని సురక్షితంగా ఐసీజీఎస్ సాచెట్ నౌకలోకి తీసుకువచ్చారు. సాయంత్రం 6 గంటలలోపు మొత్తం రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. అదృష్టవశాత్తూ మత్స్యకారులెవరూ గాయపడలేదు.

రక్షించిన అనంతరం ఆరుగురు మత్స్యకారులతో కలిసి ఐసీజీఎస్ సాచెట్ నౌక న్యూ మంగళూరు పోర్టుకు బయలుదేరింది. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన అధికారిక ప్రక్రియలను పూర్తి చేయనున్నారు. ప్రమాద సమయంలో తీరరక్షక దళం ప్రదర్శించిన వేగం, సమన్వయం, సాహసం మరోసారి వారి అత్యవసర స్పందన సామర్థ్యాన్ని చాటిచెప్పింది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us