Kerala Governor: కేరళ గవర్నర్‌పై సుప్రీం కోర్టుకు ఫిర్యాదు.. మళ్లీ మొదలైన రాజకీయ రగడ

|

Nov 03, 2023 | 8:57 AM

రాష్ట్ర శాసనసభలో ఆమోదించిన బిల్లులకు అంగీకారం తెలపడంతో కేరళ రాష్ట్ర గవర్నర్‌ అరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ విపరీతమైన జాప్యం చేస్తున్నారని కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు ఫిర్యాదు చేసింది. బిల్లులకు త్వరగా అంగీకారం తెలిపేలా గవర్నర్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అపారమైన ప్రజా ప్రయోజనాలు ఉన్న ఎనిమిది బిల్లులపై గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అంగీకారం తెలపకపోవడంపై ఫిర్యాదు చేస్తూ కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును..

Kerala Governor: కేరళ గవర్నర్‌పై సుప్రీం కోర్టుకు ఫిర్యాదు.. మళ్లీ మొదలైన రాజకీయ రగడ
Kerala State Governor Arif Mohammed Khan
Follow us on

తిరువనంతపురం, నవంబర్‌ 3: రాష్ట్ర శాసనసభలో ఆమోదించిన బిల్లులకు అంగీకారం తెలపడంతో కేరళ రాష్ట్ర గవర్నర్‌ అరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ విపరీతమైన జాప్యం చేస్తున్నారని కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు ఫిర్యాదు చేసింది. బిల్లులకు త్వరగా అంగీకారం తెలిపేలా గవర్నర్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అపారమైన ప్రజా ప్రయోజనాలు ఉన్న ఎనిమిది బిల్లులపై గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అంగీకారం తెలపకపోవడంపై ఫిర్యాదు చేస్తూ కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది .

గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులు అపారమైన ప్రజా ప్రయోజనాలు, సంక్షేమ కార్యక్రమాలను అందిస్తాయి. బిల్లుల ఆలస్యం మూలంగా రాష్ట్ర ప్రజలకు అందవల్సిన సంక్షేమ ఫలాలు అందకుండా పోతున్నాయి. గవర్నర్ ప్రవర్తన ప్రజాక్షేమాన్ని తారుమారు చేసేలా ఉందని కేరళ రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది. చట్టబద్ద పాలన, ప్రజాస్వామ్య సుపరిపాలనతో సహా రాజ్యాంగంలోని ప్రాథమిక అంశాలు, ప్రాథమిక పునాదులకు శాసన సభా ద్వారా ఆమోదం పొందిన బిల్లులు కీలకమైనవని, వీటి ద్వారా అమలు చేయాలనుకుంటున్న సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలకు చేరకుండా అడ్డుకునేలా గవర్నర్‌ ప్రవర్తస్తున్నారంటూ కేరళ ప్రభుత్వం ఆరోపించింది. ఏకపక్షంగా బిల్లులను పెండింగ్‌లో ఉంచడం వల్ల రాజ్యాంగంలోని 14వ అధికరణాన్ని ఉల్లంఘించడమే అవుతుందని నొక్కిఒక్కానించింది. అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం రాష్ట్ర ప్రజల హక్కులను కాలరాయడం అవుతుందని పటిషన్‌లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా ఈ వారం ప్రారంభంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవిపై ఇలాంటి ఫిర్యాదులను లేవనెత్తుతూ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. రాజ్యాంగ అధిపతి, రాష్ట్రంలో ప్రజాబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి మధ్య రాజ్యాంగ ప్రతిష్టంభనకు దారితీసేలా గవర్నర్ చర్యలు ఉన్నాయంటూ అత్యున్నత ధర్మాసనానికి ఫిర్యాదు చేసింది. చట్ట సభల్లో ఆమోదం పొందిన బిల్లులను గవర్నర్ ఆమోదం తెలిపే కాలక్రమాన్ని నిర్ణయించాలని కోర్టును పిటిషన్‌లో కోరింది. దీనిపై సుప్రీం స్పందన ఏ విధంగా ఉంటుందనేది వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.