లాక్ డౌన్ పై కేరళ ‘నీళ్లు’ ! బిజినెస్, రెస్టారెంట్లకు అనుమతి.. హోం శాఖ కన్నెర్ర

లాక్ డౌన్ పై కేరళ రాష్ట్రం 'నీళ్లు చల్లింది'. సోమవారం నుంచి ముఖ్యంగా రెండు జోన్లలో యథేఛ్చగా అన్ని వ్యాపార కార్యకలాపాలకు, వాహనాల రాకపోకలకు అనుమతి నిచ్చింది. వ్యాపారులు తమ షాపులను తెరచుకోవచ్ఛునని, హోటళ్లు మళ్ళీ ప్రారంభించవచ్చునని అంటూ ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది...

  • Publish Date - 10:40 am, Mon, 20 April 20 Edited By: Anil kumar poka
లాక్ డౌన్ పై కేరళ 'నీళ్లు' ! బిజినెస్, రెస్టారెంట్లకు అనుమతి.. హోం శాఖ కన్నెర్ర

లాక్ డౌన్ పై కేరళ రాష్ట్రం ‘నీళ్లు చల్లింది’. సోమవారం నుంచి ముఖ్యంగా రెండు జోన్లలో యథేఛ్చగా అన్ని వ్యాపార కార్యకలాపాలకు, వాహనాల రాకపోకలకు అనుమతి నిచ్చింది. వ్యాపారులు తమ షాపులను తెరచుకోవచ్ఛునని, హోటళ్లు మళ్ళీ ప్రారంభించవచ్చునని అంటూ ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టూ వీలర్స్ పై ఇద్దరు, కార్లలో మొత్తం ముగ్గురు లేక నలుగురు ప్రయాణించేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ రాష్ట్రంలో అసలు లాక్ డౌన్ ఆంక్షలకు అర్థమే లేకుండా పోయింది. సమాచారం తెలిసిన కేంద్ర హోమ్ శాఖ.. ఈ రాష్ట్ర ప్రభుత్వ తీరుపట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖ రాసింది. ఇలా చేస్తే కరోనా వ్యాప్తి నిరోధానికి కేంద్రం చేస్తున్న యత్నాలకు గండి పడుతుందని పేర్కొంది. అయితే ఈ లేఖపై కేరళ ప్రభుత్వం స్పందించలేదు.