Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌ పిటిషన్‌.. తీర్పుపై తీవ్ర ఉత్కంఠ

|

Mar 27, 2024 | 3:44 PM

లిక్కర్‌ స్కాంలో సీఎం కేజ్రీవాల్‌ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కాసేపట్లో తీర్పును వెల్లడించనుంది. ఈడీ కస్టడీ , అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్‌. తనను అక్రమంగా ఈడీ అరెస్ట్‌ చేసిందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో ఢిల్లీ హైకోర్టు ఇచ్చే తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌ పిటిషన్‌.. తీర్పుపై తీవ్ర ఉత్కంఠ
Arvind Kejriwal
Follow us on

లిక్కర్‌ స్కాంలో సీఎం కేజ్రీవాల్‌ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కాసేపట్లో తీర్పును వెల్లడించనుంది. ఈడీ కస్టడీ , అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్‌. తనను అక్రమంగా ఈడీ అరెస్ట్‌ చేసిందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో ఢిల్లీ హైకోర్టు ఇచ్చే తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఈడీ కస్టడీలో కేజ్రీవాల్‌ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని ఆయన భార్య సునీత కేజ్రీవాల్‌ ఆరోపించారు. లిక్కర్‌ స్కాంలో ఈడీ ఇప్పటివరకు 250 సార్లు దాడులు చేసిందని, కాని ఒక్క పైసా కూడా స్వాధీనం చేసుకోలేదన్నారు. అసలు లిక్కర్‌ స్కాం డబ్బు ఎక్కడ దాచారో రేపు కోర్టులో కేజ్రీవాల్‌ వెల్లడిస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేజ్రీవాల్‌ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆప్‌ ఎమ్మెల్యేలు వినూత్నరీతిలో నిరసన తెలిపారు. కేజ్రీవాల్‌ మాస్క్‌లు ధరించి అసెంబ్లీకి హాజరయ్యారు. మరోవైపు కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై అమెరికా స్పందనపై భారత్‌ తీవ్ర అభ్యంతరం తెలిపింది. అమెరికా రాయబార కార్యాలయాన్ని పిలిపించి ఈ వ్యవహారంపై వివరణ అడిగారు. చట్టం ముందు అందరూ సమానమేనని, కేజ్రీవాల్‌ కోసం ప్రత్యేక చట్టం లేదని అమెరికాకు కేంద్రం తెలిపింది.

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడుల్లో డబ్బు దొరకలేదని, ఎక్సైజ్ పాలసీ కుంభకోణంపై ఈ నెల 28న కోర్టులో తన భర్త అన్ని విషయాలు బయటపెడుతారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత అన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ను మార్చి 21న ఈడీ అరెస్టు చేసింది. మార్చి 28 వరకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి కోర్టు అప్పగించిన విషయం తెలిసిందే.