KCR Delhi Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)తో కేసీఆర్ భేటీ అయ్యారు. కేజ్రీవాల్‌తో కలిసి కేసీఆర్.. ఢిల్లీలోని మోతీబాగ్‌లో ఉన్న సర్వోదయ ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా కేసీఆర్‌కు సర్వోదయ పాఠశాలను చూపించారు. అనంతరం అక్కడి సిబ్బంది పాఠశాల ప్రత్యేకతలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్య, సదుపాయాలను కేసీఆర్‌కు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు.
విద్యార్థులను జాబ్ సీకర్లుగా కాకుండా జాబ్ ప్రొవైడర్లుగా మార్చుతున్న విధానం చాలా బావుందని, ఇంత పెద్ద జన సంఖ్య ఉన్న మన దేశానికి ఇది చాలా అవసరమని, తెలంగాణలో కూడా ఈ విధానం అమలు చేస్తామని కేసీఆర్ అన్నారు. మా రాష్ట్రం నుంచి త్వరలో అధికారుల బృందాన్ని పంపించి సమన్వయం చేసుకుంటామన్నారు. పాఠశాల పరిశీలన అనంతరం మొహల్లా క్లినిక్‌లను కేసీఆర్ పరిశీలించనున్నారు. కాగా, మధ్యాహ్నం ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో భేటీ అయ్యారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి