వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం కేసులో వెలుగులోకి సంచలనాలు.. ప్రధాన నిందితుడు అతడేః ఈడీ

|

Oct 14, 2024 | 1:47 PM

మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి సంస్థ (వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం) డబ్బు దుర్వినియోగం జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్‌లో పేర్కొంది.

వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం కేసులో వెలుగులోకి సంచలనాలు..  ప్రధాన నిందితుడు అతడేః ఈడీ
B Nagendra
Follow us on

మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి సంస్థ (వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం) డబ్బు దుర్వినియోగం జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్‌లో పేర్కొంది. వాల్మీకి కార్పొరేషన్‌కు సంబంధించిన కోట్ల రూపాయల కుంభకోణానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే బి. నాగేంద్రే అసలు సూత్రధారి అని ప్రకటించింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన బళ్లారి అభ్యర్థి ఖర్చుల కోసం ఉపయోగించినట్లు వెల్లడించింది. ఈ మేరకు ED అధికారిక ప్రకటన విడుదల చేసింది.

రూ.187 కోట్లు వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ఈడీ 24 మంది నిందితుల పేర్లను చేర్చినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ కేసులో బి.నాగేంద్రను ప్రధాన నిందితుడిగా ఈడీ పేర్కొంది. హైదరాబాద్‌ ఫస్ట్‌ క్రెడిట్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సత్యనారాయణ, బ్యాంక్‌ చైర్మన్‌ ఇటకారి సత్యనారాయణ, వాల్మీకి నిగమ్‌ ఎండీ జేజీ పద్మనాభం, సహచరులు నాగేశ్వరరావు, నెక్కుంటి నాగరాజ్‌, విజయ్‌కుమార్‌ గౌడ్‌లు ఈ అక్రమాలకు పాల్పడ్డారని ప్రకటనలో తెలిపారు.

అక్రమాస్తుల వ్యవహారంపై సిట్, సీబీఐ విచారణ జరిపి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోని వివిధ బ్యాంకుల్లో రూ. 89.62 కోట్ల నగదును నకిలీ ఖాతాలకు బదిలీ చేసినట్లు గుర్తించారు. బెంగళూరు నగరంలోని ఎంజీ రోడ్డులోని యూనియన్ బ్యాంకు నుంచి 187 కోట్ల నగదు బదిలీ అయింది. ఇందులో రాష్ట్ర గంగా సంక్షేమ పథకానికి రూ. 43.33 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ వివిధ ఖాతాలకు నగదు బదిలీ చేసి నగదుగా మార్చుకున్నారని ఈడీ అభియోగాలు మోపింది. ఈ కుంభకోణంపై ఈడీ తన నివేదికను సమర్పించింది. అవినీతికి పాల్పడిన రూ.89 కోట్లలో రూ.42 కోట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బి.నాగేంద్ర సన్నిహితులకు చేరినట్లు నివేదికలో పేర్కొంది.

బళ్లారి లోక్‌సభ ఎన్నికల ఖర్చు కోసం కార్పొరేషన్‌కు చెందిన 20.19 కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసింది. ఎన్నికల ఖర్చుతో పాటు వ్యక్తిగత అవసరాల కోసం కేటాయింపులు చేశారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి ఇంటిపై సోదాలు నిర్వహించగా.. కొన్ని కీలక వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నాగేంద్ర మిత్రుడు విజయ్‌కుమార్‌ మొబైల్‌ ఫోన్‌ను సీజ్‌ చేసి స్వాధీనం చేసుకోగా, అందులో డబ్బు పంపిణీ చేసినట్లు ఉన్న పూర్తి వివరాలు బయటపడ్డాయి. ఈ చర్య వెలుగులోకి రావడంతో మొబైల్‌ ఫోన్‌ను ధ్వంసం చేశారని, మిగతా నిందితులను బెదిరింపులకు గురిచేశారని ఈడీ ఆరోపించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..