Tomato: టమాట పంటతో ఏకంగా స్పోర్ట్స్‌ కారు కొన్న రైతు.. ‘ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్తా’

|

Aug 08, 2023 | 9:42 AM

ఆరుగాలం పండించిన పంటను రోడ్డుపక్కన పారబోసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇన్నాళ్లకు ఊహించని రీతిలో టమాటకు అధిక ధర పలకడంతో రైతుల ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. నానాటికీ పెరుగుతున్న టామాటాల ధరలు రైతులను ధనవంతులను చేయడమే అందుకు కారణం. టమాటాలు రైతులను ఖరీదైన వాహనాలకు యజమానుల్నీ చేస్తున్నాయి. తాజాగా కర్ణాటకకు చెందిన ఓ రైతు టమాట పంటను విక్రయించి ఏకంగా స్పోర్ట్స్‌ కారు కొనేశాడు. వివరాల్లోకెళ్తే..

Tomato: టమాట పంటతో ఏకంగా స్పోర్ట్స్‌ కారు కొన్న రైతు.. ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్తా
Karnataka farmer buys SUV
Follow us on

బెంగళూరు, ఆగస్టు 8: గత కొంతకాలంగా దేశ వ్యాప్తంగా టమాటా ధరలు హడలెత్తిస్తున్నాయి. కిలో టమాటా ఏకంగా రూ.300ల ధర పలకడం బహుశా ఇదే తొలిసారేమో. దీంతో సామాన్యులు వంటల్లో టమాట వినియోగించడమే మరచిపోయారు. మరికొందరేమో టమాట దొంగతనాలకు పాల్పడ్డారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో నిత్యం వింటూనే ఉన్నాం. మరోవైపు ఎన్నడూ లేనిది టమాట రైతులు ఒక్కసారిగా కోటీశ్వరులై పోయారు. పంటకు సరైన ధరలేక టమాట రైతు ఎన్నో సార్లు కన్నీరుపెట్టుకున్నాడు. ఆరుగాలం పండించిన పంటను రోడ్డుపక్కన పారబోసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇన్నాళ్లకు ఊహించని రీతిలో టమాటకు అధిక ధర పలకడంతో రైతుల ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. నానాటికీ పెరుగుతున్న టామాటాల ధరలు రైతులను ధనవంతులను చేయడమే అందుకు కారణం. టమాటాలు రైతులను ఖరీదైన వాహనాలకు యజమానుల్నీ చేస్తున్నాయి. తాజాగా కర్ణాటకకు చెందిన ఓ రైతు టమాట పంటను విక్రయించి ఏకంగా స్పోర్ట్స్‌ కారు కొనేశాడు. వివరాల్లోకెళ్తే..

కర్ణాటకకు చెందిన యువ రైతు రాజేష్‌ టామాటాలు అమ్మడం ద్వారా దాదాపు రూ.40 లక్షలు సంపాదించినట్లు సోమవారం మీడియాకు వెల్లడించాడు. తన 12 ఏకరాల పొలంలో పండిన టమాటాలను విక్రయించడం ద్వారా భారీగా లాభం గడించినట్లు తెలిపాడు. మీడియాతో మాట్లాడుతూ.. గతంలో పెళ్లి చూపులకు వెళితే నన్ను పెళ్లి చేసుకోవడానికి యువతులు తిరస్కరించారు. టామాటాల ద్వారా వచ్చిన లాభంతో ఎస్‌యూవీ కారు కొన్నాను. ఈ కారులోనే పెళ్లి చూపులకు వెళతా. ప్రభుత్వ ఉద్యోగం, కార్పొరేట్‌ జాబ్స్‌ చేస్తున్న అబ్బాయిలకే అమ్మాయిల కుటుంబాలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. కాలం కలిసి వస్తే రైతులు కూడా ఉద్యోగుల మాదిరే అధిక లాభాలు గడిస్తారు. నా 12 ఎకరాల పొలంలో టమాట సాగు చేశాను. నేను దాదాపు 8 వందల బస్తాల టమాట పండించాను. వాటిని విక్రయించి రూ.40 లక్షలు సంపాదించాను. రూ. కోటి కూడ సంపాదించగలను. నేను భూమిని నమ్ముకున్నాను. అది నన్ను నిరాశపరచలేదని’ ఆనందం వ్యక్తం చేశాడు.

కాగా అత్యధిక టమాటా సాగు చేసే రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. కోలార్, చామరాజనగర్ వంటి ప్రాంతాలు టమోటా పంటలకు ప్రసిద్ధి. ఇటీవల కోలార్‌కు చెందిన ఓ రైతు కుటుంబం 2 వేల బాక్సుల టమాటాలను విక్రయించి రూ. 38 లక్షల లాభం గడించి వార్తల్లో నిలిచన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.