కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల రంగం వేడెక్కుతోంది. ఎన్నికలకు ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో నేతలు సుడిగాలి ప్రచారం చేస్తూ ప్రజల్ని ప్రసన్న చేసుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు. మే6న ప్రధాని మోదీ బెంగళూరులో 36 కి.మీ. మీటర్ల మేర రోడ్ షో నిర్వహించారు. రోడ్డు పొడవునా ప్రజలు గుమిగూడి మోదీకి పూలమాలలతో స్వాగతం పలికారు. మోదీ రోడ్ షోకు బీజేపీ నాయకులు ఊహించినదానికంటే ప్రజల నుంచి ఎక్కువ మద్దతు రావడంతో ఆ పార్టీ నాయకులు సంతోషంలో మునిగితేలుతున్నారు.. ఇది మోదీ హవా అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.
శనివారం ఉదయం మైఖ్రి సర్కిల్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో కోణెణకుంటే క్రాస్ లోని కాలేజ్ లోని హెలిప్యాడ్ కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ కోణెణకుంటేలో రోడ్ షో మొదలుపెట్టారు. మోదీ రోడ్ షో కోసం బెంగళూరులో ప్రత్యేకంగా తయారు చేసిన వాహనంలో మోదీ రోడ్‌షో నిర్వహించారు. ఉదయం 10.15 గంటలకు మొదలైన ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో ఎక్కడా విరామం లేకుండా కొనసాగింది. మోదీ రోడ్ షో వెళ్లిన రహదారులు అన్ని బీజేపీ జెండాలు, కాషాయ జెండాలు, జై హనుమాన్, జై భజరంగిబలి జెండాలతో రెపరెపలాడాయి.
రాష్ట్రంలో అధికారంలోకి వస్తే భజరంగ్‌దళ్ వ్యవస్థను నిషేధిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. దీన్ని బీజేపీ వ్యతిరేకించింది. ఈ విషయాన్ని ప్రధాని కూడా ప్రచారంలో వెల్లడించారు. ఓటు వేసేటప్పుడు జై బజరంగ్ దళ్ అని చెప్పాలని మోదీ పేర్కొన్నారు. కాగా, ప్రచారంలో భాగంగా మోదీ హవేరీ జిల్లాలో పర్యటించారు. అక్కడ మోదీ కోసం ప్రత్యేకించి ఏలకులతో చేసిన మాల, కిరీటం సిద్ధం చేశారు. వీటిని ఇస్లాం ప్రజలు తయారు చేస్తారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..