రైతుకు అవమానం.. GT మాల్‌కు 7 రోజుల తాళం.. 1.78 కోట్ల పన్ను ఎగవేసినందుకే అంటున్న అధికారులు

|

Jul 19, 2024 | 11:27 AM

మూడు రోజుల క్రితం జీటీ మాల్‌లోని మల్టీప్లెక్స్‌లో కుమారుడితో కలిసి సినిమా చూసేందుకు వచ్చిన ఫకీరప్ప అనే రైతును అక్కడి సెక్యూరిటీ గోపాల్‌ అడ్డుకుంటున్న సమయంలో ఫకీరప్ప కుమారుడు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఘటనపై రైతు సంఘాల నాయకులు తీవ్రంగా స్పందించారు. మాల్‌ యాజమాన్యం క్షమాపణలు చెప్పకపోతే, పంచెకట్టుతో వేల మంది రైతులు వచ్చి మాల్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. దాంతో.. దిగొచ్చిన మాల్ యాజమాన్యం.. రైతుకు శాలువా కప్పి సత్కరించింది.

రైతుకు అవమానం.. GT మాల్‌కు 7 రోజుల తాళం.. 1.78 కోట్ల పన్ను ఎగవేసినందుకే అంటున్న అధికారులు
Bengaluru Mall Closed
Follow us on

బెంగళూరులోని మాగడి రోడ్డులోని జీటీ మాల్‌లోని మల్టీప్లెక్స్‌లోకి తన కుమారుడితో కలిసి సినిమా చూసేందుకు హావేరికి చెందిన ఫకీరప్ప అనే రైతుని అక్కడి సెక్యూరిటీ గోపాల్‌ అడ్డుకున్నాడు. షాపింగ్ మాల్‌లోకి ప్రవేశించాలంటే పంచెకట్టు కుదరదని.. ప్యాంట్-షర్ట్ ధరించాలి అనే చెప్పారు. ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. మాల్ తీరుపై సర్వత్రా నిరసన వ్యకం అయింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు కూడా కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. వెంటనే పెద్ద బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ మగాడి రోడ్డులోని ఈ షాపింగ్ మాల్‌కు ఏడు రోజుల తాళం వేసింది. అయితే మాల్ అధికారులు రూ.1.78 కోట్ల పన్ను చెల్లించలేదని, అందుకే ఈ చర్య తీసుకున్నామని బీబీఎంపీ పేర్కొంది. షాపింగ్ మాల్ 2023-24 నాటి పన్నును ఎగ్గొట్టిందని బీబీఎంపీ అధికారి తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు కూడా జారీ చేసింది. అయినప్పటికీ డబ్బులు చెల్లించకపోవడంతో మాల్‌ను తాత్కాలికంగా మూసివేసినట్లు ఎప్ర్కొన్నారు.

అయితే మూడు రోజుల క్రితం జీటీ మాల్‌లోని మల్టీప్లెక్స్‌లో కుమారుడితో కలిసి సినిమా చూసేందుకు వచ్చిన ఫకీరప్ప అనే రైతును అక్కడి సెక్యూరిటీ గోపాల్‌ అడ్డుకుంటున్న సమయంలో ఫకీరప్ప కుమారుడు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఘటనపై రైతు సంఘాల నాయకులు తీవ్రంగా స్పందించారు. మాల్‌ యాజమాన్యం క్షమాపణలు చెప్పకపోతే, పంచెకట్టుతో వేల మంది రైతులు వచ్చి మాల్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. దాంతో.. దిగొచ్చిన మాల్ యాజమాన్యం.. రైతుకు శాలువా కప్పి సత్కరించింది. అందరి ముందు క్షమాపణలు కోరింది. ఇకపై ఇటువంటి పొరపాటు చేయబోమని ప్రకటించింది జీటీ మాల్‌.

ఇవి కూడా చదవండి

మరోవైపు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బైరతి సురేశ్‌ మాట్లాడుతూ చట్టానికి లోబడి మాల్ ను ఏడు రోజుల పాటు మూసివేసే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గురువారం కర్ణాటక అసెంబ్లీలో ఏడు రోజుల పాటు మాల్స్‌ను మూసివేస్తున్నట్లు సురేష్ ప్రకటించారు. అంతకుముందు, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 2 (తప్పుల సవరణ) కింద మాల్ యజమాని, సెక్యూరిటీ గార్డులపై కేసు నమోదు చేయబడింది.

 

కర్ణాటకలోని హవేరి జిల్లాకు చెందిన ప్రముఖ రైతు ఫకీరప్ప కొడుకు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల కుమారుడిని కలిసేందుకు ఫకీరప్ప పట్టణానికి వచ్చాడు. ఫకీరప్ప కొడుకు తన తండ్రికి షాపింగ్ మాల్ సినిమాలో సినిమా చూపించాలనుకున్నాడు. మాల్‌లోకి ప్రవేశిస్తుండగా మాల్‌ సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ఫకీరప్ప, ఆయన కుమారుడికి సినిమా చూసేందుకు టిక్కెట్లు ఉన్నప్పటికీ వారిని లోనికి అనుమతించలేదు. మాల్‌ పాలసీ ప్రకారం ధోతీలో ప్రవేశం నిషిద్ధమని భద్రతా సిబ్బంది చెబుతున్నట్లు తెలిసింది. సెక్యురిటీ గార్డులను ఎంతగా నచ్చచెప్పినా వినలేదు సరికదా ఫకీరప్పను ప్యాంటు ధరించి రావాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఈ ఘటనపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ ఘటనను కాంగ్రెస్ ప్రభుత్వంపై దాడికి బీజేపీ కూడా ఉపయోగించుకుంది. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా కాంగ్రెస్‌ను రైతు వ్యతిరేకి అని అన్నారు. కర్నాటక ముఖ్యమంత్రి కూడా ధోతి ధరించిన మాల్‌లోకి వెళ్తే అడ్డుకుంటారా అంటూ పూనావాలా ప్రశ్నించారు. ఈ ఘటనపై కన్నడ రైతు సంఘాలు కూడా గురువారం నిరసనలు తెలిపాయి. మాల్ అధికారులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పొట్టి బట్టలు వేసుకున్న వారిని లోపలికి అనుమతిస్తే, ధోతీ ధరించి లోనికి ఎందుకు ప్రవేశించకూడదు? వారు ప్రశ్నించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..