Viral Video: ఆమె శాపంతోనే ఆయన సీఎం పదవికి ముప్పు! వైరలవుతున్న పాత వీడియోలు..

|

Jun 24, 2022 | 2:56 PM

మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం అస్థిరతలో కొట్టుమిట్టాడుతుండటం, ఆయన పదవికి గండం ఏర్పడటంపై ఓ వైపు రాజకీయ వాదోపవాదాలు జరుగుతుండగా, మరోవైపు ఇదంతా ఓ మహిళను ఏడిపించిన ఉసురే.. ఆయ‌న సీఎం ప‌ద‌విని క‌దిలించింది

Viral Video: ఆమె శాపంతోనే ఆయన సీఎం పదవికి ముప్పు! వైరలవుతున్న పాత వీడియోలు..
Kangana
Follow us on

మహారాష్ట్రలో (Maharastra) ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం అస్థిరతలో కొట్టుమిట్టాడుతుండటం, ఆయన పదవికి గండం ఏర్పడటంపై ఓ వైపు రాజకీయ వాదోపవాదాలు జరుగుతుండగా, మరోవైపు ఇదంతా ఓ మహిళను ఏడిపించిన ఉసురే.. ఆయ‌న సీఎం ప‌ద‌విని క‌దిలించింది అనే చ‌ర్చ మొద‌ల‌యింది. కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ (Bollywood’s controversial queen) కంగనా రనౌత్ బీజేపీకి మద్దతుగా శివసేన పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసింది. అంతే కాకుండా సీఎంతో పాటు ఆయన తనయుడిపై తీవ్ర విమర్శలు చేసింది. ఆ సమయంలో శివసేన కార్యకర్తలు ఆమెను ముంబయి లో తిరగనివ్వం అంటూ హెచ్చరించారు.

అంతటితో ఆగలేదు శివసేన కార్యకర్తలు. కంగనా ఎంతో ఇష్టపడి కట్టుకున్న (Kangana’s Mumbai office)మణికర్ణిక ఆఫీస్ ను ముంబయి మున్సిపల్ (BMC demolished)అధికారులు నిబంధనలకు విరుద్దంగా ఉందంటూ కూల్చేశారు. కంగనా ఆ సమయంలో ఒక వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో “నేడు నీ చేతిలో అధికారం ఉంది కనుక ఇలా చేశావు. కాని ఆ అధికారం నీకు ఎప్పటికి ఉండదు అని గుర్తు పెట్టుకో” అంటూ హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి

మరో వీడియోలో ఆమె మాట్లాడుతూ “ఒక మహిళను బాధ పెట్టిన ఏ ఒక్కరు సుఖ పడినట్లు.. సంతోషంగా ఉన్నట్లుగా లేదు. త్వరలోనే మీ పతనం ఉంటుంది” అంటూ కంగనా ఆ సమయంలో శాపం పెట్టింది.ఆమె శాపం చాలా తక్కువ సమయంలోనే నిజం అయ్యింది అన్నట్లుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె అభిమానులు వాఖ్యలుచేస్తూ ఆ వీడియోలను షేర్ చేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం సంక్షోభం విషయంలో కంగనా ఎలా స్పందిస్తుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్ర‌స్తుతం మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితికి కారణం బీజేపీ అంటూ కొందరు వాదిస్తూ ఉంటే, మరి కొందరు శివసేన పార్టీ హిందుత్వంను వీడటం అంటూ మరి కొందరు వాదిస్తున్నారు. ఈ సమయంలో కొందరు మాత్రం హీరోయిన్ కంగనా రనౌత్ పెట్టిన శాపం.. ఆమె కన్నీళ్లు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పీఠాన్ని కదిలించాయంటూ ఆరోపిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..