కేంద్ర బడ్జెట్ ను సినీ నటుడు, మక్కళ్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్ హసన్ ‘హల్వా బడ్జెట్’ గా అభివర్ణించారు. హల్వా సెరిమనీతో ఈ బడ్జెట్ మొదలైందని, అలాగే ఈ దేశప్రజలకు ‘హల్వా’ ఇవ్వడంతో ముగిసిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అధికారులకు హల్వా అందించడంతో ఈ బడ్జెట్ ప్రారంభమైంది. చివరకు సామాన్య ప్రజలకు దీన్ని ఇవ్వడంతో సమాప్తమైంది.. అంటే సుదీర్ఘమైన ప్రసంగమైతే ఉంది కానీ.. ఖఛ్చితమైన పరిష్కారాలు లేవు అని ఆయన ట్వీట్ చేశారు. లోక్ సభలో బడ్జెట్ సమర్పణకు ముందు ప్రభుత్వం హల్వా సెరిమనీని సంప్రదాయంగా నిర్వహిస్తోంది. దాన్ని దృష్టిలో ఉంచుకుని కమల్ హసన్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజల ప్రయోజనాలకు అనువుగా ఈ బడ్జెట్ లేదని ఆయన ఆరోపించారు.