Chief Justice: సుప్రీమ్ కోర్టు జడ్జీల కోసం తొలిసారిగా ముగ్గురు మహిళల పేర్లు నమోదు.. తొలి సీజేఐగా నాగరత్న అయ్యే ఛాన్స్

Woman Chief Justice: మహిళలు అన్నింటా మగవారితో సమానమే.. ఇల్లాలుగా ఉద్యోగిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించే మహిళామూర్తులకు ప్రపంచమే సలాం కొడుతోంది..

Chief Justice: సుప్రీమ్ కోర్టు జడ్జీల కోసం తొలిసారిగా ముగ్గురు మహిళల పేర్లు నమోదు.. తొలి సీజేఐగా నాగరత్న అయ్యే ఛాన్స్
Supreme Court

Updated on: Aug 18, 2021 | 2:57 PM

Woman Chief Justice: మహిళలు అన్నింటా మగవారితో సమానమే.. ఇల్లాలుగా ఉద్యోగిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించే మహిళామూర్తులకు ప్రపంచమే సలాం కొడుతోంది. తాజాగా భారత దేశపు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి గా పదవిని చేపట్టడానికి రంగం సిద్ధమైంది. దీంతో 22 నెలల సుదీర్ఘ ప్రతిష్టంభనకు తెరపడింది. అత్యున్నత న్యాయస్థానం జడ్జి పదవుల కోసం తొమ్మిది మంది పేర్లను చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వి.రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు చేసింది.

ఈ తొమ్మిది మందిలో మొదటిసారిగా ముగ్గురు మహిళల పేర్లను సిఫారసు చేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ సీజేఐ వెంకట్రామయ్య కూతురు .. కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్‌ బివి నాగరత్న తొలి సీజేఐగా అయ్యే అవకాశం ఉంది. తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ హిమా కొహ్లి, గుజరాత్‌ హైకోర్టుకి చెందిన న్యాయమూర్తి బేలా త్రివేదిల పేర్లను ప్రకటించారు. 2027లో జస్టిస్‌ నాగరత్న సుప్రీంకోర్టు మొదటి మహిళా చీఫ్‌ జస్టిస్‌ కానున్నారు. జస్టిస్ నాగరత్న 2008లో కర్ణాటక హైకోర్టు అదనపు జడ్జిగా నియామకమయ్యారు. రెండేళ్ల తర్వాత ఆమె పర్మినెంట్ జడ్జిగా నియమితులయ్యారు. నాగరత్న తండ్రి ఈఎస్ వెంకట్రామయ్య కూడ గతంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేశారు. 1989 జూన్ 1989 డిసెంబర్ మధ్యలో వెంకట్రామయ్య సీజేఐగా పనిచేశారు.

ఒకవేళ నాగరత్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా నియామకం జరిగితే తండ్రి అడుగుజాడల్లో నడుస్తుదందనే అభిప్రాయాలున్నాయి. జస్టిస్‌ ఆర్‌. నారిమన్‌ పదవీవిరమణ చేసిన కొద్ది రోజులకే ఈ సిఫారసులు వెలువడ్డాయి. జస్టిస్‌ ఒకాతో పాటు జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జెకె. మహేశ్వరిల పేర్లను కూడా జాబితాలోకి తీసుకున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో జస్టిస్ ఇందిరా బెనర్జీ ఉన్నారు. ఆమె 2022లో రిటైర్ కానున్నారు. ఇప్పటివరకు సుప్రీంకోర్టుకు 8 మంది మహిళా న్యాయమూర్తులు మాత్రమే నియమించారు. దేశంలో అత్యంత సీనియర్‌ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ ఒకా పౌరస్వేచ్ఛపై పలు తీర్పులు ఇచ్చారు. ఈ సిఫారసులు ఆమోదం పొందితే… సుప్రీంకోర్టులో ఉన్న ప్రస్తుత ఖాళీలన్నీ భర్తీ అవుతాయి. దీంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కి చేరనున్నది.

Also Read:  ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్‌లో కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ఏయే పండ్లతో ఎలా తయారుచేసుకోవాలంటే