కేరళ త్రిసూర్ జిల్లాలోని పవిత్ర విష్ణు క్షేత్రం గురువాయూరు. దక్షిణ ద్వారకగా ఖ్యాతిగాంచిన ఈ క్షేత్రంలో శ్రీ కృష్ణుడు ‘గురువాయూరప్పన్’ అనే పేరుతో భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. ఇటీవల కొత్తగా పెళ్లయిన జంట ఓ జంట గురువాయూరు ఆలయాన్ని సందర్శించింది. ఈ సమయంలో ఈ జంట దేవాలయంలో ఉన్న ఓ ఏనుగు దగ్గరగా వెడ్డింగ్ ఫోటో షూట్ జరుపుకుంటున్న సమయంలో ఓ ఏనుగు రెచ్చిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను వెడ్డింగ్ మోజిటో అనే ఫోటోగ్రాఫర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. గురువాయూరు ఆలయం లో నవంబర్ 10న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఏనుగు దాడి చేస్తున్న సమయంలో భక్తులు ఆందోళనకు గురయ్యారు.
వైరల్ అవుతున్న వీడియోలో ఫోటో షూట్ కోసం నూతన వధూవరులు ఆలయం లోపలి ప్రాంగణానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఆ జంట వెనుక ఏనుగు నిలబడి ఉంది. కెమెరామెన్ వధూవరుల ఫోటోలను క్లిక్ చేయడం ప్రారంభించిన సమయంలో ఆ ఏనుగు అకస్మాత్తుగా కోపంతో తనపై ఉన్న మావటిని కిందకు పడేసింది. తన తొండంతో అతడిపై అటాక్ చేయడం ప్రారభించింది. అయితే వెంటనే తేరుకున్న మావటి అక్కడ నుంచి త్వరగా లేచి తప్పించుకున్నాడు. అతని బట్టలు ఏనుగుదగ్గరే చిక్కుకున్నాయి. ఏనుగుపై ఉన్న రెండో మావటి ఏనుగును నియంత్రంచి అదుపులోకి తీసుకున్నాడు.
ఈ సంఘటనను వరుడు గుర్తుచేసుకున్నాడు.. వీడియోలో తన అనుభవాన్ని చెప్పాడు. “మేము ఫోటో కోసం పోజులిస్తున్నాము.. అకస్మాత్తుగా, అందరూ అరుస్తూ పరిగెత్తడం ప్రారంభించారు. నా చేయి పట్టుకుని వధువు పరిగెత్తింది” అని వరుడు తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు.
గురువాయూరు దేవాలయం హిందూ వివాహ ఆచారాలకు చాలా ప్రసిద్ధి చెందింది.
కొన్ని నెలల క్రితం కేరళలోని కొల్లాం అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తిని అడవి ఏనుగులు తొక్కి చంపిన సంగతి తెలిసిందే. 50 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తి దట్టమైన అడవి గుండా వెళ్లే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా మూడు ఏనుగుల గుంపు దాడి చేసిందని పోలీసులు తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..