Hemant Soren: జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం.. రాజీనామా దిశగా హేమంత్ సోరెన్.. అత్యవసర కేబినెట్ భేటీ..

|

Sep 01, 2022 | 2:31 PM

Jharkhand Political Crisis: హేమంత్‌ సోరెన్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారు. జార్ఖండ్‌ గవర్నర్‌ రమేశ్‌ బైస్‌తో సీఎం సోరెన్‌ కాసేపట్లో భేటీ అయ్యే అవకాశముంది.

Hemant Soren: జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం.. రాజీనామా దిశగా హేమంత్ సోరెన్.. అత్యవసర కేబినెట్ భేటీ..
Hemant Soren
Follow us on

జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌(Hemant Soren) ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారు. జార్ఖండ్‌ గవర్నర్‌ రమేశ్‌ బైస్‌తో సీఎం సోరెన్‌ కాసేపట్లో భేటీ అయ్యే అవకాశముంది. రాజీనామా తరువాత తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరబోతున్నారు హేమంత్‌ సోరెన్‌. రాజీనామా చేసి తిరిగి ఎమ్మెల్యే పదవికి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు హేమంత్‌ సోరెన్‌. అయితే ఇప్పటివరకు గవర్నర్‌ రమేశ్‌ బైస్‌ యూపీఏ కూటమి నేతలకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు.

సీఎం పదవిని దుర్వినియోగం చేశారని , సోరెన్‌పై అనర్హత వేటు వేయాలని ఈసీ నుంచి గవర్నర్‌కు సిఫారసు లేఖ అందిన తరువాత జార్ఖండ్‌ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. గవర్నర్‌ ఇప్పటివరకు తన నిర్ణయాన్ని వెల్లడించలేదు.

బీజేపీ తమ ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతుందన్న భయంతో యూపీఏ కూటమి ఎమ్మెల్యేలను చత్తీస్‌ఘడ్‌ రాజధాని రాయ్‌పూర్‌కు తరలించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం