JEE Mains 2021: ఎన్‌టీఏ కీలక నిర్ణయం.. జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు వాయిదా..

|

Apr 18, 2021 | 11:27 AM

JEE Mains 2021: దేశంలో కరోనా మహమ్మారి తీవ్రంగా విస్తరిస్తోంది. మూడు రోజుల నుంచి రెండు లక్షలకుపైగానే కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు పరీక్షలను వాయిదా వేస్తున్న

JEE Mains 2021: ఎన్‌టీఏ కీలక నిర్ణయం.. జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు వాయిదా..
JEE Mains 2021
Follow us on

JEE Mains 2021: దేశంలో కరోనా మహమ్మారి తీవ్రంగా విస్తరిస్తోంది. మూడు రోజుల నుంచి రెండు లక్షలకుపైగానే కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు పరీక్షలను వాయిదా వేస్తున్న విషయం తెలిసిందే. కరోనా దృష్ట్యా రెండురోజుల క్రితం సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలను సైతం రద్దు చేశారు. 12 తరగతి పరీక్షలను వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 27 నుంచి 30 వరకు జరగనున్న జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ పరీక్షను కూడా కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ మేరకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆదివారం ప్రకటనను విడుదల చేసింది. జేఈఈ మెయిన్‌ ఏప్రిల్‌ సెషన్‌ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే.. మళ్లీ పరీక్ష తేదీలను 15 రోజుల ముందుగా ప్రకటిస్తామని ప్రకటించింది. కాగా.. మొదటి రెండు సెషన్లు ఇప్పటికే.. ఫిబ్రవరి, మార్చిలో పూర్తయ్యాయి. కాగా మూడో సెషన్‌ పరీక్ష ఉరగాల్సి ఉంది.


కాగా.. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జేఈఈ మెయిన్స్ పరీక్ష నిర్వహించవద్దని విద్యార్థులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో పరీక్ష నిర్వహించడం వల్ల తాము వైరస్ బారిన పడే ప్రమాదముందని పేర్కొంటున్నారు. అయితే ముందుగా కేంద్ర ప్రభుత్వం సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు, నీట్‌ పీజీ పరీక్ష జరుగుతుందని స్పష్టంచేసింది. అయితే విద్యార్థులు, తల్లిదండ్రులు, పలు పార్టీల నాయకులు పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో ప్రధాని నరేంద్రమోదీ అధికారులతో సమావేశమైన అనంతరం సీబీఎస్‌ఈ పరీక్షలపై విద్యాశాఖ నిర్ణయాన్ని వెల్లడించింది. పది పరీక్షలను రద్దు చేయగా.. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేశారు. కరోనా వ్యాప్తి అధికంగా పెరిగిన ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్స్‌ మూడో సెషన్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. ఈ పరీక్షలపై మళ్లీ నిర్ణయం తీసుకోనున్నారు.

Also Read:

Kumbh Mela 2021: ఆ యాత్రికులకు 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి.. కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ ప్రభుత్వం

RTGS: బ్యాంక్‌ కస్టమర్లకు అలర్ట్‌.. నేడు 14 గంటల పాటు ఆర్‌టీజీఎస్‌ సేవలు నిలిపివేత.. ఎందుకంటే..?