సస్పెన్స్ వీడింది..మోదీ కేబినెట్ లోకి లోక్ జన శక్తి పార్టీ, జేడీ-యూ ….నితీష్ కుమార్ కోర్కె తీరింది

సస్పెన్స్ వీడింది..మోదీ కేబినెట్ లోకి లోక్ జన శక్తి పార్టీ,  జేడీ-యూ ....నితీష్ కుమార్ కోర్కె తీరింది
Pm Modi Yoga Speech

ప్రధాని మోదీ కేబినెట్ లోకి లోక్ జన శక్తి పార్టీ (ఎల్ జే పీ), జనతాదళ్-యూ రెండు పార్టీలకు ప్రాతినిధ్యం దక్కింది. జెడీ-యూ జాతీయ అధ్యక్షుడు ఆర్.సి పీ. సింగ్, ఎల్ జె పీ నేత పశుపతి కుమార్ పరాస్ లను కేబినెట్ లోకి తీసుకుంటున్నారు. కొత్త మంత్రివర్గంలో తమకు నాలుగు పదవులు దక్కాలని లేని .....

Umakanth Rao

| Edited By: Anil kumar poka

Jul 07, 2021 | 4:16 PM

ప్రధాని మోదీ కేబినెట్ లోకి లోక్ జన శక్తి పార్టీ (ఎల్ జే పీ), జనతాదళ్-యూ రెండు పార్టీలకు ప్రాతినిధ్యం దక్కింది. జెడీ-యూ జాతీయ అధ్యక్షుడు ఆర్.సి పీ. సింగ్, ఎల్ జె పీ నేత పశుపతి కుమార్ పరాస్ లను కేబినెట్ లోకి తీసుకుంటున్నారు. కొత్త మంత్రివర్గంలో తమకు నాలుగు పదవులు దక్కాలని లేని పక్షంలో తాము ప్రభుత్వంలో చేరబోమని జేడీ-యూ కి చేందిన ఓ సీనియర్ నేత ఖరా ఖండిగా చెప్పినప్పటికీ మోదీ వ్యూహం ముందు దానికి చుక్కెదురైంది. ఆర్ సీపీ సింగ్ అభిమతం ప్రకారం ఈ పార్టీ లాభపడింది. బీహార్ లో చిరాగ్ పాశ్వాన్ ను కాదని, తానే లోక్ జనశక్తి పార్టీ నేతనని ప్రకటించుకున్న పశుపతికి తాను కోరుకున్నది లభించింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాడు చిరాగ్ నేతృత్వంలోని ఎల్ జేపీ కారణంగా తమ పార్టీకి కలిగిన నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు మోదీ..పశుపతిని వినియోగించుకున్నట్టు కనిపిస్తోంది. పైగా జేడీ-యూ కి కేబినెట్ లో చోటు కల్పించడం ద్వారా ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ ని సంతృప్తి పరచినట్టు కూడా అవుతుంది. నిజానికి చిరాగ్ పాశ్వాన్ బీజేపీతో సఖ్యతగా ఉన్నప్పటికీ ఈ పార్టీ మొదటి నుంచీ ఆయనతో అంటీముట్టనట్టుగా ఉంటూ వచ్చింది. ఇందుకు నితీష్ తెరవెనుక జరిపిన యత్నాలు కూడా ఫలించినట్టేనని చెబుతున్నారు.

రామ్ విలాస్ పాశ్వాన్ మృతి తరువాత కేంద్ర మంత్రివర్గంలో లోక్ జనశక్తి పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇప్పుడు పశుపతిని తీసుకోవడం ద్వారా ఆ లోటును భర్తీ చేస్తున్నారు. ఇక ఆర్ సి పీ సింగ్ నితీష్ కి చాలా సన్నిహితడు. మాజీ ఐఏఎస్ అధికారి అయిన ఈయనను కేబినెట్ లోకి తీసుకోవడం ద్వారా నితీష్ ని మరింత సంతృప్తి పరిచినట్టయింది.

మరిన్ని ఇక్కడ చూడండి : సోషల్ మీడియాలో ‘గృహలక్ష్మీ’ నటి మరో రచ్చ.. ముఖ్యమంత్రి పై షాకింగ్ కామెంట్స్..(వీడియో):actor kasturi shankar video.

 కరోనా కన్నా .. మాకు చేపలే ఎక్కువ?తమిళనాడు లో కోవిడ్ నిబంధలు ఉల్లంఘన వైరల్ అవుతున్న వీడియో..:Tamil Nadu Video.

 ఒట్టి చేతులతో వెనక్కి ఎందుకు.. చెప్పులు ఎత్తికెళ్తే పోలా..? దొంగతనంకు దర్జాగా లిఫ్ట్ లో వచ్చిన దొంగ..(వీడియో):Viral Video.

 ఫుట్ బాల్ పిచ్‌లో గ‌ర్ల్‌ఫ్రెండ్‌కి పెళ్లి ప్రపోజల్..!హోరెత్తిన స్టేడియం..వైరల్ అవుతున్న వీడియో..:Proposal on pitch video.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu