Worlds Top Philanthropist: గత 100 ఏళ్లలో ప్రపంచంలో అత్యధిక విరాళం ఇచ్చిన అభినవ దానకర్ణుడు మన భారతీయుడే.. ఎవరో తెలుసా..

|

Jun 24, 2021 | 8:43 PM

Worlds Top Philanthropist: దాన గుణం కర్ణుడు గొప్పవాడు అని పురాణ కథనం..అయితే ప్రస్తుతం ప్రపంచంలో గొప్ప దాన గుణం కలవాడు ఎవరు అంటే బిల్ గేట్స్ వెంటనే చెబుతారు..

Worlds Top Philanthropist: గత 100 ఏళ్లలో ప్రపంచంలో అత్యధిక విరాళం ఇచ్చిన అభినవ దానకర్ణుడు మన భారతీయుడే.. ఎవరో తెలుసా..
Worlds Top Philanthropist
Follow us on

Worlds Top Philanthropist: దాన గుణం కర్ణుడు గొప్పవాడు అని పురాణ కథనం..అయితే ప్రస్తుతం ప్రపంచంలో గొప్ప దాన గుణం కలవాడు ఎవరు అంటే బిల్ గేట్స్ వెంటనే చెబుతారు.. కానీ గత 100 ఏళ్లలో అత్యధికంగా దానం చేసిన ఘనత కూడా మన భారతీయుడి కే దక్కింది. అవును ప్రపంచవ్యాప్తంగా గత శతాబ్దానికి సంబంధించిన విరాళాలపై హరూన్​,ఎడెల్​గేవ్​ ఫౌండేషన్​లు సంయుక్తంగా ఓ నివేదికను రూపొందించారు. అందులో మొత్తం 50 మందికి చోటు దక్కింది. ఈ టాప్​-50 జాబితాలో 37 మంది ఇప్పటికే మరణించగా13 మంది మాత్రమే జీవించి ఉన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా విరాళం ఇచ్చి ప్రధమ స్థానంలో నిలిచింది మన భారతీయుడు జెంషెట్​జీ టాటా. ఈయన టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు . గడిచిన వందేండ్లలో ప్రపంచంలోనే అత్యంత పెద్దమొత్తంలో విరాళాలు ఇచ్చారని హరూన్​, ఎడెల్​గేవ్​ ఫౌండేషన్​ల నివేదిక ద్వారా తెలుస్తోంది.

టాటా గ్రూప్ మొదలు పెట్టినప్పటి నుంచి సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని.. గడిచిన100 ఏళ్లలో పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్​ వ్యవస్థాపకుడు ‘జెంషెట్​ జీ టాటా’ 102 బిలియన్​ డాలర్లను సేవాకార్యక్రమాలకు వినియోగించారని స్పష్టం చేసింది. దక్షిణ గుజరాత్‌లోని నవ్‌సరి అనే నగరంలో 1839 లో జన్మించిన టాటా 1870 లలో సెంట్రల్ ఇండియా స్పిన్నింగ్ వీవింగ్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీని ప్రారంభించారు. ఉన్నత విద్య కోసం 1892 లో జెఎన్ టాటా ఎండోమెంట్‌ను స్థాపించారు, దీని ద్వారానే టాటా ట్రస్ట్‌ల ద్వారా సేవాకార్యక్రమాలు ప్రారంభించారు.

టాటా తర్వాత స్థానంలో మైక్రోసాఫ్ట్​ సహ వ్యవస్థాపకుడు బిల్​గేట్స్.. ఆయన మాజీ భార్య మెలిందా సంయుక్తంగా రెండవ స్థానంలో ఉన్నారు. ఈ దంపతులు ఇద్దరూ కలిసి 74.6 బిలియన్​ డాలర్లు విరాళంగా ఇచ్చినట్లు నివేదిక తెలిపింది. అయితే బిల్ గేట్స్ త్వరలో మెలిందా నుంచి విడాకులు తీసుకోనున్నారన్న సంగతి తెలిసిందే..

37.4 బిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చి మూడో స్థానంలో నిలిచారు ప్రముఖ ఇన్వెస్టర్​ వారెన్​ బఫెట్​. 34.8 బిలియన్​ డాలర్లను విరాళంగా ఇచ్చి సోరస్​ నాలుగో స్థానములో ఉండగా.. జాన్ డీ రాక్​ఫెల్లర్ 26,8 బిలియన్​ డాలర్లు విరాళంగా ఐదో స్థానములో నిలిచారు.అయితే ఈ టాప్ 50 మెంబర్స్ లో మరో భారతీయుడు విప్రో అధినేత అజీమ్​ ప్రేమ్​జీ కూడా ఉన్నారు. ఈయన 22 బిలియన్​ డాలర్లు వితరణ చేసినట్లు నివేదిక పేర్కొంది.

50 మంది ఉన్న ఈ లిస్ట్ లో మొత్తం 38 మంది అమెరికాకు చెందినవారు ఉండగా.. యూకేకు చెందిన వారు 5 మంది, చైనీయులు ముగ్గురు ఉన్నారు. ఈ 50 మంది కలిసి.. గత 100 ఏళ్లలో మొత్తం 832 బిలియన్ డాలర్ల సేవాకార్యక్రమాలు నిర్వహించినట్లు.. వివిధ సంస్థల ద్వారా సేవాకార్యక్రమాలు నిర్వహించినట్లు నివేదిక ద్వారా తెలిపింది.

Also Read: జీర్ణ క్రియను మెరుగుపరచడంలో ప్రకృతి ప్రసాదం ఆగాకార.. ఈ సీజన్ లో తినాల్సిందే