భార‌త్ జోడో న్యాయ్‌యాత్రలో ‘జై శ్రీరాం.. జై మోదీ’ నినాదాలు.. రెండు వర్గాల మధ్య తోపులాట

Updated on: Feb 03, 2024 | 6:14 PM

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర జార్ఖండ్‌లో రెండో రోజు కొనసాగుతోంది. దేవగఢ్‌ లోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం బాబ వైద్యనాథ్‌ను దర్శించుకున్నారు. బాబా బైద్యనాథ్‌కు సాంప్రదాయ దుస్తుల్లో ప్రత్యేక పూజలు చేశారు రాహుల్‌గాంధీ. కాంగ్రెస్‌ నేతలు కూడా హజరయ్యారు.

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర జార్ఖండ్‌లో రెండో రోజు కొనసాగుతోంది. దేవగఢ్‌ లోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం బాబ వైద్యనాథ్‌ను దర్శించుకున్నారు. బాబా బైద్యనాథ్‌కు సాంప్రదాయ దుస్తుల్లో ప్రత్యేక పూజలు చేశారు రాహుల్‌గాంధీ. కాంగ్రెస్‌ నేతలు కూడా హజరయ్యారు. అయితే రాహుల్‌గాంధీ పూజలు చేస్తున్న సమయంలో ఆలయం బయట బీజేపీ కార్యకర్తలు హంగామా చేశారు. జై మోదీ.. జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. వాళ్లకు పోటీగా కాంగ్రెస్‌ కార్యకర్తలు కూడా రాహుల్‌గాంధీ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. రెండు వర్గాల మధ్య తోపులాట జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ప్రధాని మోదీ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు రాహుల్‌. మోదీ అంటే అదానీ అని అర్ధమని దేశప్రజలు అనుకుంటున్నారని అన్నారు. ఆదివాసీల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేసిందన్నారు.

Published on: Feb 03, 2024 06:08 PM