
2025లో ఎన్నో ప్రయోగాలను సక్సెఫుల్ చేసిన ఇస్రో 2026లో తన తొలి ప్రయోగం చేసింది. శ్రీహరికోటలోని సతీస్ దవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి PSLV-C62 రాకెట్‌ను విజయవంతంగా నింగిలోకి పంపింది. ఈ రాకెట్ 1452 కేజీల ‘అన్వేష’ EOS-N1 అనే ఉపగ్రహాంతో పాటు విదేశాలకు చెందిన మరో 15 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది. ఈ అన్వేషన్ అనే ఉపగ్రహం నింగిలోంచి భూమి ఉపరితలాన్ని అత్యంత సూక్ష్మంగా పరిశీలించనుంది. శత్రుదేశాల కదలికలు, సరిహద్దుల పర్యవేక్షణ, వ్యూహాత్మక నిఘా కార్యకలాపాల ఈ అన్వేష కీలకంగా మారనుంది. ఈ శాటిలైట్‌కు ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఇది ఏవైనా విపత్తులు సంభవించే అవకాశం ఉంటే.. ఈ సమాచారన్ని ముందుగానే అధికారులకు చేరవేస్తుంది. ఇది రక్షణ, విపత్తు నిర్వహణ రంగాల్లో కీలక పాత్ర పోషించనుంది. ఈ శాటిలైట్ హైపర్‌స్పెక్ట్రల్ టెక్నాలజీతో పని చేస్తుంది.
Liftoff!
PSLV-C62 launches the EOS-N1 Mission from SDSC-SHAR, Sriharikota.
Livestream link: https://t.co/fMiIFTUGpf
For more information Visit:https://t.co/3ijojDaYB2
#PSLVC62 #EOSN1 #ISRO #NSIL— ISRO (@isro) January 12, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.