ఇజ్రాయిల్ – హమాస్ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ అజయ్’ ప్రారంభించింది. ఈ ఆపరేషన్ లో భాగంగా ఇజ్రాయిల్‌లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను స్వదేశానికి రప్పించే ప్రక్రియ కొనసాగుతోంది. 212 మంది భారతీయ పౌరులతో కూడిన మొదటి బ్యాచ్ శుక్రవారం భారతదేశానికి చేరుకుంది. అలాగే రెండో విమానంలో 235 మంది భారతీయులు టెల్ అవీవ్ నుండి బయలుదేరి ఈరోజు ఉదయం 6 గంటలకు ఢిల్లీ చేరుకున్నారు.
ఇజ్రాయిల్ నుండి 235 మంది భారతీయ పౌరులను తిరిగి తీసుకుని వస్తున్న ఎయిర్ ఇండియా రెండవ విమానం శుక్రవారం సాయంత్రం 5.35 గంటలకు టెల్ అవీవ్ నుండి బయలుదేరింది. అదే సమయంలో ఈ విమానం ఈరోజు ఉదయం 6 గంటలకు ఢిల్లీకి చేరుకుంది. దాదాపు 18,000 మంది భారతీయులు ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయారు. భారత ప్రభుత్వం బుధవారం ‘ఆపరేషన్ అజయ్’ ప్రారంభించింది. భారత పౌరుల భద్రతకు కట్టుబడి ఉన్నామని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు.
#OperationAjay | Second flight carrying 235 Indian nationals takes off from Israel's Tel Aviv, tweets EAM Dr S Jaishankar pic.twitter.com/qPCyI5MpPD
— ANI (@ANI) October 13, 2023
మొదటి బ్యాచ్ 212 మంది పౌరులు శుక్రవారం ఉదయం చార్టర్డ్ విమానం ద్వారా భారతదేశానికి చేరుకున్నారన్న సంగతి తెలిసిందే. ఇజ్రాయిల్ నుండి భారతీయ పౌరులు తిరిగి రావడానికి మొదటి విమానం గురువారం సాయంత్రం 212 మందితో బెన్ గురియన్ విమానాశ్రయం నుండి బయలుదేరి శుక్రవారం ఉదయం ఢిల్లీకి చేరుకుంది. ఇలా స్వదేశానికి తిరిగి వస్తున్న భారతీయులకు సంబంధించిన ఖర్చులను భారత ప్రభుత్వం భరిస్తుంది. ఇజ్రాయిల్‌లో ప్రస్తుతం 18,000 మంది భారతీయులు నివసిస్తున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారం తెలిపారు.
గత శనివారం ఉదయం హమాస్ అకస్మాత్తుగా ఇజ్రాయిల్‌పై దాడి చేసి బీభత్సం సృష్టించింది. హమాస్ యోధులు ఇజ్రాయిల్‌పై 5000కు పైగా రాకెట్లను ప్రయోగించారు. ఈ దాడిలో 1300 మందికి పైగా ఇజ్రాయిల్ ప్రజలు మరణించగా వేలాది మంది గాయపడ్డారు. ఈ దాడి తరువాత ఇజ్రాయిల్ కూడా ప్రతీకారం తీర్చుకుంటూనే ఉంది. ఇందులో వందలాది మంది హమాస్ ప్రజలు మరణించారు. వేలాది మంది ప్రజలు గాయపడ్డారు. గత ఏడు రోజులుగా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం నడుస్తోంది. హమాస్‌పై ఇజ్రాయిల్ నిరంతరం దాడులు చేస్తోంది. దాదాపు 3 లక్షల మంది ఇజ్రాయిల్ సైనికులు గాజా స్ట్రిప్‌లో మోహరించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..