
పాకిస్థాన్ గూఢఛార సంస్థ ఐఎస్ఐ..ఆగస్టు 15 న అయోధ్య లోని రామజన్మ భూమిలో ఉగ్రదాడులకు కుట్ర పన్నిందని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఇందుకు ఆఫ్ఘనిస్థాన్ లో లష్కర్, జైషే మహమ్మద్ టెర్రరిస్టులకు శిక్షణ ఇస్తున్నట్టు రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ పేర్కొంది. మూడు నుంచి ఐదు ఉగ్రవాద బృందాలను ఇందుకు నియోగించవచ్ఛునని ఈ సంస్థ తెలిపింది. అయితే ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు సిధ్ధంగా ఉన్నట్టు ఈ సంస్థ వెల్లడించింది. ముందు జాగ్రత్త చర్యగా అయోధ్య, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ లో భద్రతా దళాలను అప్రమత్తం చేశారు. పోలీసు బలగాలను పెంచారు. ఆగస్టు 5 న అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రధాని మోదీ భూమిపూజ చేయనున్న సంగతి తెలిసిందే.