మణిపూర్‌లో హై అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. సెక్షన్ 144 సెక్షన్ విధించడంతో పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపి వేసింది. చురాచాంద్ పూర్‌లో నిన్న సీఎం బీరెన్ సింగ్ పర్యటించాల్సి ఉండగా ఆయన సభకు నిప్పు పెట్టడం కలకలం సృష్టిస్తోంది. ఈ హఠాత్ పరిణామంతో అప్రమత్తమైన ప్రభుత్వం అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టింది. మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వం చిత్తడి నేలలతో పాటు రిజర్వ్, రక్షిత ప్రాంతాలను సర్వే చేయడం ప్రారంభించింది. దీనిని అక్కడి ఆదివాసీ గిరిజనులు వ్యతిరేకిస్తూ కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళనలను ప్రభుత్వం అణగదొక్కుతోంది. సీఎం తీరుపై ఆగ్రహంగా ఉన్న గిరిజనులు సమయం కోసం వేచి చూశారు. సీఎం ప్రారంభించబోయే జిమ్‌కు సంబంధించిన కుర్చీలు, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. దీంతో సీఎం సభా వేదిక కూడా దగ్ధమైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..