బ..బ.. ‘బధ్ధకిస్టుల్లో ‘ బంగారం ‘ లాంటి భారతీయులు !

|

Oct 30, 2019 | 5:20 PM

‘ అబ్బా ! చాలా బధ్ధకంగా ఉంది గురూ ! ఇవాళ ఏమీ చేయలేను ‘ అనే టైపు బధ్దకిష్టులు ఇండియన్లేనట ! పైగా రోజుకు సగటున 6533 స్టెప్స్ మాత్రమే వేస్తారట కూడా.. (అంటే నడకలో కూడా సోమరితనమేనన్న మాట) ! ఇలా అని ‘ ఫిట్ బిట్ ‘ అనే ఫిట్ నెస్ యాప్ డేటా విశ్లేషించింది. అమెరికా, బ్రిటన్, జపాన్, సింగపూర్ సహా మొత్తం 18 దేశాల్లోని ప్రజల బిహేవియర్ ని విశ్లేషించి […]

బ..బ.. బధ్ధకిస్టుల్లో  బంగారం  లాంటి భారతీయులు !
Follow us on

‘ అబ్బా ! చాలా బధ్ధకంగా ఉంది గురూ ! ఇవాళ ఏమీ చేయలేను ‘ అనే టైపు బధ్దకిష్టులు ఇండియన్లేనట ! పైగా రోజుకు సగటున 6533 స్టెప్స్ మాత్రమే వేస్తారట కూడా.. (అంటే నడకలో కూడా సోమరితనమేనన్న మాట) ! ఇలా అని ‘ ఫిట్ బిట్ ‘ అనే ఫిట్ నెస్ యాప్ డేటా విశ్లేషించింది. అమెరికా, బ్రిటన్, జపాన్, సింగపూర్ సహా మొత్తం 18 దేశాల్లోని ప్రజల బిహేవియర్ ని విశ్లేషించి ఈ డేటాను ఓ నివేదిక బయటపెట్టింది.

జపాన్ తరువాత భారతీయులు నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతారని కూడా వెల్లడైంది. అంటే నిద్రలేమి వీరి ‘ సొంత అలవాటు ‘ గా మారిపోయింది. సగటున వీరు ఏడు గంటల ఒక నిముషం మాత్రమే నిద్ర పోతారని అంటున్నారు. ఇది రష్యాలో ప్రజలు నిద్ర పోయే సమయం కన్నా 48 నిముషాలు, అమెరికన్ల విషయానికి వస్తే 32 నిముషాలు తక్కువట.. అయితే ఐర్లాండ్ లో సగటున స్లీప్ సమయం ఏడు గంటల 57 నిముషాలని తేల్చారు. రాపిడ్ ఐ మూవ్ మెంట్ (అంటే కంటి కదలికల వల్ల శరీర మెటబాలిజం ) గురించి కూడా ఈ నివేదిక పేర్కొంది. ఇండియన్ల విషయానికే వస్తే.. ఇది 77 నిముషాలుగా తేలింది. ప్రపంచంలోనే ఇది తక్కువ అంటున్నారు. ఎమోషన్ రెగ్యులేషన్, మెమొరీ, సెల్యులార్ లెవెల్ ప్రోటీన్ సింథసిస్ వంటి వాటిలో అత్యంత ప్రాధాన్యం వహించే ఈ రాపిడ్ ఐ మూవ్ మెంట్ గురించి లోతుగా ఈ యాప్ విశ్లేషించింది. కాగా భారతీయుల్లో 75… 90 మధ్య వయస్సు గల వ్యక్తులు తక్కువ సమయం నిద్రపోతారట. అయితే వార్ధక్యం కారణంగా ఇది తప్పదు..వివిధ శారీరక కారణాల దృష్ట్యా వారి అలవాటు క్రమేపీ నిద్రా సమయాన్ని తక్కువచేస్తుంది. ఇది సహజం కూడా.. కాగా… చాలా చురుకైనవారు హాంకాంగ్ వాసులని ఈ యాప్ తేల్చింది.