Independence Day: త్రివర్ణ పతాకం అసలు పవర్ మాకు తెలుసు.. క్రీడాకారుల స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు..

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తై.. 76వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా స్వాతంత్య్ర వేడుకలు వాడవాడలా ఘనంగా జరుగుతున్నాయి. కేంద్రప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట ఘనంగా

Independence Day: త్రివర్ణ పతాకం అసలు పవర్ మాకు తెలుసు.. క్రీడాకారుల స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు..
Sachin
Follow us

|

Updated on: Aug 15, 2022 | 2:49 PM

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తై.. 76వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా స్వాతంత్య్ర వేడుకలు వాడవాడలా ఘనంగా జరుగుతున్నాయి. కేంద్రప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట ఘనంగా ఈవేడుకలను నిర్వహిస్తున్న వేళ.. భారత క్రీడాకారులు సోషల్ మీడియా వేదికగా దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడంతో పాటు.. జెండా వందనం చేసిన ఫోటోలను పంచుకున్నారు.

మాజీ క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, వసీం జాఫర్, మహమ్మద్ కైఫ్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, తెలగు తేజం భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి.సింధు, బాక్సర్లు మేరీ కోమ్, నిఖత్ జరీన్, సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి తదితరులు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్ ల ద్వారా భారత్ తో అనుబంధం కలిగిన డేవిడ్ వార్నర్ తన అభిమానులు, దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈసందర్భంగా పలువురు క్రీడాకారులు పలు కొటేషన్లతో ట్వీట్ చేశారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రెండు ప్రతిజ్ఞలు చేద్దాం.. ఒకటి ఎవరూ చూడనప్పుడు మంచి పనులు చేద్దాం.. ఎవరి సమక్షంలో లేకపోయినా మంచి విషయాలను చెబుదాం అంటూ గౌతమ్ గంభీర్ ట్వీట్ చేశారు.  త్రివర్ణ పతాకం అసలు వపర్ ఏంటో ఇండియా జర్సీ వేసుకున్న తమకు తెలుసని మహమ్మద్ కైఫ్ ట్వీట్ చేశారు. భారత్ కు ప్రాతినిధ్యం వహించడం మాటల్లో వర్ణించలేని అనుభూతి అని..తెలంగాణ బిడ్డ నిఖిత్ జరీన్ పేర్కొన్నారు. ఇలా పలువురు క్రీడాకారులు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..