Indian railways: మహిళా భద్రతకు రైల్వే శాఖ కీలక నిర్ణయాలు.. మార్గదర్శకాలు విడుదల

|

Mar 22, 2021 | 6:33 PM

Indian railways new guidelines: భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్ల లోపల, రైల్వే ప్రాంగణాల్లో మహిళలపై జరగుతున్న నేరాలను నిరోధించడానికి కఠిన మార్గదర్శకాలను జారీ చేసింది. భారతీయ రైల్వేలో

Indian railways: మహిళా భద్రతకు రైల్వే శాఖ కీలక నిర్ణయాలు.. మార్గదర్శకాలు విడుదల
Indian Railways New Guidelines
Follow us on

Indian railways new guidelines: భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్ల లోపల, రైల్వే ప్రాంగణాల్లో మహిళలపై జరగుతున్న నేరాలను నిరోధించడానికి కఠిన మార్గదర్శకాలను జారీ చేసింది. భారతీయ రైల్వేలో ప్రతిరోజూ ప్రయాణించే 2.3 కోట్ల మంది ప్రయాణికులలో.. 20% మంది మహిళలపై నేరాలు జరుగుతున్నాయని.. ఇది ఆందోళన కలిగించే విషయమని రైల్వేశాఖ తెలిపింది. మహిళా ప్రయాణికులపై నేరాలను అరికట్టేందుకు, ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేసేందుకు వీలుగా రైల్వే మంత్రిత్వశాఖ మార్చి 20న కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలంటూ రైల్వే జోన్ అధికారులకు ఆదేశాలు జారీచేసింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

● రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రాంతం, ప్లాట్‌ఫాంలు, మరుగుదొడ్ల వంటి ప్రదేశాల్లో నేరాలు అధికంగా జరుగుతున్నాయని ఆయా ప్రాంతాల్లో సరైన లైటింగ్, నిఘా వ్యవస్థ ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించింది. దీంతోపాటు స్టేషన్ల పరిసరాల్లో అనవసరమైన నిర్మాణాలను కూల్చివేయాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

● వెయిటింగ్ రూముల్లో పకడ్భందీ భద్రత ఉండాలని.. రాత్రి వేళల్లో వ్యక్తులను తనిఖీ చేసి రూముల్లోకి అనుమతించాలని పేర్కొంది. ప్రయాణికులు ఎక్కువగా ఉన్నప్పుడు గమనిస్తూ ఉండాలి.

● రైల్వే కోచ్‌లల్లోకి రాత్రివేళ అనుమానస్పద, అనధికార వ్యక్తులు ప్రవేశించకుండా నిరోధించాలని మంత్రిత్వ శాఖ అధికారులను కోరింది. దీనికోసం ఎల్లప్పుడూ బోగీలను లాక్ చేసి ఉంచాలని వెల్లడించింది.

● రైల్వే ప్రాంగణంలో అనుమానస్పద వ్యక్తులెవరైనా కనిపిస్తే వారిపై నిఘా ఉంచాలని పేర్కొంది. అసాంఘిక కార్యకలాపాలపై, మహిళల నేరాలపై కఠినంగా వ్యవహరించాలని పేర్కొంది.

● సీసీటీవీ ఫుటేజీలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించింది. దీంతోపాటు.. ప్లాట్‌ఫాంల దగ్గర మహిళా కోచ్‌లు నిలిచే స్థానంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి.

● రైలు హాల్టింగ్ స్టేషన్లల్లో ప్లాట్‌ఫాం చివరి భాగాన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ / గవర్నమెంట్ రైల్వే పోలీస్ సిబ్బందిని మోహరించేలా చర్యలు చేపట్టాలి.

● మహిళల భద్రత, పరిశుభ్రత, ఇతర విషయాల గురించి అవగాహన కల్పించాలని జోనల్ రైల్వే అధికారులను రైల్వే శాఖ ఆదేశించింది.

● మహిళలు, దివ్యాంగులు, చిన్నారుల పట్ల రైల్వే అధికారులు సున్నితంగా వ్యవహరించాలని, వారికి సాయమందించాలని సూచించింది.

Also Read:

Ganja Seized: అనుమానం రాకుండా లారీ అరల్లో పార్శిల్.. ఏపీలో మరోసారి భారీగా గంజాయి పట్టివేత..

Free Wifi: ఉచిత వైఫై వాడుతున్నారా.? ఈ వీడియో చూసైనా మారండి.. పోలీసుల సలహా.!