IRCTC: రైలు ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి మీరు కోరుకున్న ఫుడ్.. ఆ అవకాశం ఎవరికంటే..

|

Nov 15, 2022 | 10:10 PM

ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనకు ఇష్టమైన ఆహారాన్ని తినే సౌలభ్యం ఉంటుంది. కావల్సిన ఆహారాన్ని తయారుచేసుకుని తింటాం. కాని ప్రయాణ సమాయాల్లో మాత్రం అందుబాటులో ఉండే ఆహారమే తినగలం. అదే రైలు ప్రయాణంలో..

IRCTC: రైలు ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి మీరు కోరుకున్న ఫుడ్.. ఆ అవకాశం ఎవరికంటే..
Train
Follow us on

ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనకు ఇష్టమైన ఆహారాన్ని తినే సౌలభ్యం ఉంటుంది. కావల్సిన ఆహారాన్ని తయారుచేసుకుని తింటాం. కాని ప్రయాణ సమాయాల్లో మాత్రం అందుబాటులో ఉండే ఆహారమే తినగలం. అదే రైలు ప్రయాణంలో అయితే ప్యాంటీ కార్ లో లభించే ఫుడ్ కొనుగోలు చేసి తినాల్సి ఉంటుంది. ఇక నుంచి రైళ్ల ప్రయాణ సమయంలో కావల్సిన ఆహారాన్ని ఎంచుకునే వెసులుబాటు కల్పించనుంది. రైళ్లలో ఆహారం విషయంలో రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ట్రైన్‌లో ప్రాంతీయ, స్థానిక వంటలకు ప్రాధాన్యమిచ్చేందుకు నిర్ణయించింది. మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వారికి, చిన్నారులకు, ఆరోగ్యంపై శ్రద్ధ కలిగిన వ్యక్తులు కోరే ఆహారాన్ని అందించేందుకు సిద్ధమైంది. దీనికి అనుగుణంగా వీలుగా మెనూలో మార్పులు చేసే సౌలభ్యాన్ని ఐఆర్‌సీటీసీకి కల్పించింది. కేటరింగ్‌ విభాగాన్ని మరింత మెరుగుపరచడంతో పాటు ప్రయాణికులకు ఆహారం విషయంలో మరిన్ని ఆప్షన్లు ఇచ్చేందుకు గానూ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రాంతీయ వంటకాలు, సీజనల్‌ వంటకాలతో పాటు, పండగ రోజుల్లో ప్రత్యేక ఆహారాన్ని అందించేందుకు వీలుగా మెనూలో మార్పులు చేసేందుకు ఐఆర్‌సీటీసీకి రైల్వే బోర్డు అవకాశం కల్పించింది. మధుమేహ వ్యాధిగ్రస్తులు, చిన్నారులకు అవసరమైన ఆహారం, తృణధాన్యాలతో తయారు చేసిన ఆహారాన్ని అందించేందుకు అవకాశం కల్పించింది. ప్రస్తుతానికి రైల్వే బోర్డు ఆమోదించిన మెనూనే రైళ్లలో ఐఆర్‌సీటీసీ సప్లయ్‌ చేస్తూ వస్తోంది.

కొన్ని రైళ్లలో టికెట్‌తో పాటు ఆహారానికీ ఛార్జీని ముందుగానే వసూలు చేమనున్నారు. టికెట్ బుకింగ్ సమయంలోనే ఆహారానికి సంబంధించిన ఆప్షన్ ఎంచుకోవల్సి ఉంటుంది. ప్రీపెయిడ్‌ రైళ్లలో సైతం ఇకపై అదనంగా కొన్ని బ్రాండెండ్‌ ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచనున్నారు. దీనికి ధర నిర్ణయించే అధికారం మాత్రం ఐఆర్‌సీటీసీకే అప్పగించింది. మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌లో అందించే మెనూలో మార్పులు చేసే అధికారం ఐఆర్‌సీటీసీకి ఇచ్చారు. అయితే, జనతా భోజనానికి సంబంధించి మెనూలో గానీ, ధరలో గానీ ఎలాంటి మార్పూ ఉండబోదని రైల్వే బోర్డు స్పష్టంచేసింది.

రైళ్లలో ఇక నుంచి కావల్సిన ఆహారం ఆర్డర్ చేసుకునే సౌకర్యం కల్పించడం రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆహారం విషయంలో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఇక నుంచి వారికి ఆ సమస్య తీరనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..