Indian Railways: గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తున్న పలు రైళ్లు.. ప్రయాణికులకు తప్పని తిప్పలు

|

Jul 06, 2023 | 9:05 AM

రైల్వే ప్రయాణికులకు ఇండియన్‌ రైల్వేస్‌ ముఖ్యసూచనలు జారీ చేసింది. భద్రతా పరమైన పనుల కారణంగా గత కొన్ని రోజులుగా పలు రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోన్న సంగతి తెలిసిందే. దీంతో నిత్యం రైళ్లరాకపోకలు గంటల తరబడి..

Indian Railways: గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తున్న పలు రైళ్లు.. ప్రయాణికులకు తప్పని తిప్పలు
Indian Railways
Follow us on

విశాఖపట్నం: రైల్వే ప్రయాణికులకు ఇండియన్‌ రైల్వేస్‌ ముఖ్యసూచనలు జారీ చేసింది. భద్రతా పరమైన పనుల కారణంగా గత కొన్ని రోజులుగా పలు రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోన్న సంగతి తెలిసిందే. దీంతో నిత్యం రైళ్లరాకపోకలు గంటల తరబడి ఆలస్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం (జులై 7) కొన్ని రైళ్ల సమయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు తెలియజేస్తూ వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఎకె త్రిపాఠి రీషెడ్యూల్‌ విడుదల చేశారు. అయినప్పటికీ రైళ్లు మరింత ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

ఏయే ట్రైన్ల సమయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయంటే..

  • బుధవారం మధ్యాహ్నం 3.25 గంటలకు విశాఖలో బయలుదేరాల్సిన విశాఖ-షాలిమార్‌ రాత్రి 8.25 గంటలకు బయలుదేరేలా మార్పులు చేసి పంపించారు.
  • షాలిమార్‌-చెన్నై (12841) కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌.. మధ్యాహ్నం 3.20 గంటలకు షాలిమార్‌లో బయలుదేరాల్సి ఉండగా అది సాయంత్రం 5.50 గంటలకు బయల్దేరింది.
  • షాలిమార్‌-సికింద్రాబాద్‌ (22849).. మధ్యాహ్నం12.20 గంటలకు బయలుదేరాల్సిన ఈ ట్రైన్‌ సాయంత్రం 4.50 గంటలకు బయల్దేరింది.
  • సత్యసాయి ప్రశాంతి నిలయం (22831) ఎక్స్‌ప్రెస్‌.. ఉదయం 4.50 గంటలకు హావ్‌డాలో బయలుదేరాల్సి ఉండగా అది ఆలస్యంగా సాయంత్రం 6.30 గంటలకు
  • భువనేశ్వర్‌(18464) ఎక్స్‌ప్రెస్‌ .. బెంగళూర్‌లో ఉదయం 1.40 గంటలకు బయలుదేరాల్సి ఉండగా సాయంత్రం 5.35 గంటలకు
  • డిబ్రూఘర్‌ (22503) ఎక్స్‌ప్రెస్‌.. కన్యాకుమారిలో సాయంత్రం 5.20 గంటలకు బయలుదేరాల్సిన ఈ ట్రైన్‌ రాత్రి 8.30 గంటలకు
  • విశాఖ (20812) ఎక్స్‌ప్రెస్‌.. నాందేడ్‌లో సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరాల్సిన ఈ ట్రైన్‌ సాయంత్రం 6.30 గంటలకు ఆలస్యంగా బయల్దేరింది. ఇలా ఏకంగా మూడు నుంచి 6 గంటల వరకు రైళ్లు ఆలస్యం నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.