Narendra Modi: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వాలాదేవీలు గతంలో ఎన్నడూ లేని విధంగా 600 కోట్లకుపైగా జరగడంపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఇది భారత ప్రజల సమిష్టి విజయమని ఆయన అభివర్ణించారు. యూపీఐ సేవలు మొదలైన తర్వాత అత్యధిక లావాదేవీలు జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ నేపథ్యంలో ప్రధాని మంగళవారం ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు.
యూపీఐ పేమెంట్స్ విషయమై మోదీ ట్వీట్ చేస్తూ.. ‘ఇది ఒక అద్భుతమైన విజయం. కొత్త టెక్నాలజీని స్వీకరించడడంతో పాటు, భారత ఆర్థిక వ్యవస్థను పారదర్శకంగా మార్చడానికి భారత ప్రజలు చేసిన సమిష్టి కృషికి నిదర్శనం. కోవిడ్-19 విజృంభించిన సమయంలో డిజిటల్ చెల్లింపులు ఎంతగానే ఉపయోగపడ్డాయి’ అని మోదీ పేర్కొన్నారు.. రికార్డు స్థాయిలో డిజిటల్ చెల్లింపులు జరగడంపై ఆర్థిక శాఖ మంత్రి నిర్మాల సీతారామన్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేసిన ప్రధాని పై విధంగా స్పందించారు.
This is an outstanding accomplishment. It indicates the collective resolve of the people of India to embrace new technologies and make the economy cleaner. Digital payments were particularly helpful during the COVID-19 pandemic. https://t.co/roR2h89LHv
— Narendra Modi (@narendramodi) August 2, 2022
ఇదిలా ఉంటే జూలై నెలలో ఏకంగా 600 కోట్లకుపైగా యూపీఐ పేమెంట్స్ జరిగాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, సమీక్షించిన నెలలో యూపీఐ లావాదేవీల సంఖ్య 628 కోట్లు ఉండగా, వాటి విలువ రూ. 10.62 లక్షల కోట్లు. కరోనా పరిస్థితుల తర్వాత దేశంలో డిజిటల్ చెల్లింపులు అత్యంత వేగంగా పెరిగాయని, ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టి, ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుండటంతో యూపీఐ లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నాయని ఎన్‌పీసీఐ వెల్లడించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..