కొలంబో వేదికగా భారత్-పాక్ మధ్య ఏం జరిగింది? విదేశాంగ మంత్రిత్వ శాఖ సమాధానం ఇదే..!

శ్రీలంక రాజధాని కొలంబోలో భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఒక అనధికారిక సమావేశం జరిగిందని పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అయితే, ఇందులో ఎలాంటి కొత్తదనం లేదని, ఇవి అధికారిక చర్చలు కావని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతర్జాతీయ దౌత్య పరిభాషలో 'ట్రాక్-II' సంభాషణలుగా పిలుస్తారు. ఇటువంటి అనధికారిక చర్చలలో.. రాజకీయ ఒత్తిడి లేకుండా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే మార్గాలను అన్వేషిస్తారు. ఇందులో పదవీ విరమణ చేసిన అధికారులు, శాస్త్రవేత్తలు, పౌర సమాజానికి చెందిన ప్రభుత్వేతర వ్యక్తులు పాల్గొంటుంటారు.

కొలంబో వేదికగా భారత్-పాక్ మధ్య ఏం జరిగింది? విదేశాంగ మంత్రిత్వ శాఖ సమాధానం ఇదే..!
Indian Foreign Secretary Vikram Misri

Updated on: Jun 29, 2026 | 5:43 PM

శ్రీలంక రాజధాని కొలంబోలో భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఒక అనధికారిక సమావేశం జరిగిందని పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అయితే, ఇందులో ఎలాంటి కొత్తదనం లేదని, ఇవి అధికారిక చర్చలు కావని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతర్జాతీయ దౌత్య పరిభాషలో ‘ట్రాక్-II’ సంభాషణలుగా పిలుస్తారు. ఇటువంటి అనధికారిక చర్చలలో.. రాజకీయ ఒత్తిడి లేకుండా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే మార్గాలను అన్వేషిస్తారు. ఇందులో పదవీ విరమణ చేసిన అధికారులు, శాస్త్రవేత్తలు, పౌర సమాజానికి చెందిన ప్రభుత్వేతర వ్యక్తులు పాల్గొంటుంటారు.

కొలంబోలో జరిగిన భారత్-పాకిస్తాన్ ‘ట్రాక్ II’ చర్చల గురించి మీడియా అడిగిన ప్రశ్నకు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పందించారు. “నేను అలాంటి వార్తలను చూశాను. ప్రపంచవ్యాప్తంగా వివిధ అంశాలపై ఇలాంటి డజన్ల కొద్దీ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ కార్యక్రమాలలో కొత్తదనం గానీ, ప్రత్యేకత గానీ ఏమీ లేదు. మా వరకు చూస్తే, ఇవి ప్రైవేట్ సంస్థలు నిర్వహించే ప్రైవేట్ కార్యక్రమాలు. మా దృష్టిలో, వీటిలో అధికారికమైనది ఏమీ లేదు” అని ఆయన కొట్టిపారేశారు.

ఈ చర్చల వల్ల భారత ప్రభుత్వానికి ఎలాంటి ప్రయోజనం, ప్రాధాన్యత లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. “భారత ప్రభుత్వానికి సంబంధించినంత వరకు, ఈ పర్యటనలలో ఎటువంటి అధికారిక ప్రమేయం, మద్దతు, భాగస్వామ్యం లేదు. ఈ కార్యక్రమాలలో పాల్గొనే భారతదేశం నుండి వచ్చిన వారు.. పదవీ విరమణ చేసిన దౌత్యవేత్తలు, పదవీ విరమణ చేసిన సైనిక అధికారులు, పౌర సమాజ సభ్యులు అయినా.. తమ ప్రైవేట్ అభిప్రాయాలను మాత్రమే వ్యక్తపరుస్తారు. వారు ఏ విధంగానూ భారత ప్రభుత్వ అధికారిక అభిప్రాయాలకు ప్రాతినిధ్యం వహించరు, వహించలేరు కూడా. వాస్తవానికి, మేము ఈ కార్యక్రమాలకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వము” అని విక్రమ్ మిస్రీ తేల్చి చెప్పారు.

ఇదిలావుంటే, ఎన్‌డిటివి (NDTV) కథనం ప్రకారం, కొలంబోలోని ఒక హోటల్‌లో రెండు రోజుల పాటు ఈ రహస్య చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి భారతదేశం తరఫున మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవాణే, ఇండియా ఫౌండేషన్ అధ్యక్షుడు రామ్ మాధవ్, మాజీ దౌత్యవేత్త రుచి ఘనశ్యామ్ హాజరైనట్లు సమాచారం. అలాగే పాకిస్తాన్ తరఫున విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి సజ్జాద్ హైదర్ ఖాన్, మాజీ రాయబారి షెర్రీ రెహమాన్, రిటైర్డ్ మేజర్ జనరల్ ఇస్ఫండియం అలీ ఖాన్ పటౌడీలు హాజరయ్యారని కథనంలో పేర్కొన్నారు. ఈ అనధికారిక సమావేశంలో ఇరు దేశాల మధ్య ప్రధాన సమస్యలైన సరిహద్దు ఉగ్రవాదం, నీటి పంపిణీ, భవిష్యత్తులో సైనిక ఘర్షణలను నివారించడం వంటి కీలక అంశాలపై చర్చలు జరిగినట్లు ఆ వార్త కథనం వెల్లడించింది.

భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఏమన్నారంటే..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us