
కాన్వాయ్‌లో ఓ రెండు కార్లు తగ్గించేస్తే.. ఆయిల్‌ను ఆదా చేసినట్టేనా! మహా అయితే ఓ 10, 20 లీటర్లు సేవ్ చేస్తారేమో! అంతమాత్రానికే రాబోయే కష్టం నుంచి దేశం బయటపడిపోతుందా! అది కాదు దానర్థం. కొనే స్థోమత ఉన్నా సరే.. జేబులో సరిపడా డబ్బుంది, నాకింకా దిగులేంటి అనే ధీమా ఉన్నా సరే.. ఆ దుబారా చేయొద్దు అని చెప్పడమే దీని మీనింగ్. 60 రోజులకు సరిపడా ఆయిల్ నిల్వలున్నాయి మనదగ్గర. రష్యా నుంచో, మరో దేశం నుంచో ఆయిల్ వస్తూనే ఉంది. బట్.. రాబోయే సంక్షోభం అది కాదు. ఇప్పుడు పొదుపు చేయకపోతే, చేతిలో ఉన్న డబ్బు దాచుకోకపోతే, అవసరానికి తగ్గట్టు వాడుకోకపోతే.. ఆల్‌మోస్ట్ రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుందనేది కాన్వాయ్‌ల తగ్గింపు వెనక ఉన్న వార్నింగ్ మెసేజ్. లేకపోతే.. మూకుడులో పోసే నూనెను సైతం తగ్గించుకోండి అని ప్రధానమంత్రి అంతటి వ్యక్తి చెప్పడమేంటి? రాబోయేది ఆయిలో, డాలర్ల సమస్యో కాదు.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. నెలనెలా కట్టే ఈఎంఐలు కూడా పెరుగుతాయి. అదేం లింక్ అనుకోవద్దు. ధరాభారం దేన్నీ వదిలిపెట్టదు. అసలు ధరలు ఎందుకు పెరుగుతాయి. సప్లై తగ్గి డిమాండ్ ఉంటేనే కదా. చేతిలో డబ్బుంటే ఎంత డిమాండ్ ఉన్నా ఆ...