మధ్యప్రదేశ్‌లోని మోరార్ కంటోన్మెంట్‌లో జవాన్ల కోసం నిర్మించిన మొదటి 3డీ ప్రింటెడ్ భవనాన్ని భారత సైన్యం ఆధ్వర్యంలో ప్రారంభించారు. సైనిక నిర్మాణాలలో నూతన ఆవిష్కరణలకు రూపొందించిన ప్రణాళికల్లో భాగంగా మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ (MES), తెలంగాణకు చెందిన సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ మరియు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) హైదరాబాద్ భాగస్వామ్యంతో చేపట్టిన ఈ వినూత్న ప్రాజెక్ట్, సైనిక మౌలిక సదుపాయాలలో ఒక పెద్ద ముందడుగును వేయనుంది. దీన్న షాబాజ్ డివిజన్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ KTG కృష్ణన్ ప్రారంభించారు.
ఈ అత్యాధునిక బ్యారక్ రిమోట్ క్లిష్టతరమైన, సవాలుగా ఉన్న భూభాగంలో సైనికులకు సమర్థవంతమైన గృహ సముదాయాన్ని, అవసరాన్ని సూచిస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా అధునాతన నిర్మాణ పద్ధతులను ఉపయోగించడం ద్వారా, జవాన్లకు నాణ్యమైన వసతి కల్పించడంతోపాటు గృహనిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. ఇండియన్ ఆర్మీ తన సిబ్బందికి గృహనిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు అధునాతన నిర్మాణ సాంకేతికతలను విస్తరించేందుకు సిద్ధం అయ్యింది.